Today(13-03-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారం ట్రేడింగ్‌ని శుభారంభం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇవాళ సోమవారం ఉదయం రెండు కీలక సూచీలు లాభాలతో మొదలయ్యాయి. కానీ.. ఇంట్రాడేలో ఆ ట్రెండ్‌ని కొనసాగించలేకపోయాయి. దీంతో.. సాయంత్రం భారీ నష్టాలతో ముగిశాయి. ఈ ఏడాది కనిష్ట విలువలను నమోదు చేశాయి.
వివిధ రంగాల్లోని కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తడికి గురయ్యాయి. ఫలితంగా.. ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, మహింద్రా అండ్ మహింద్రా, ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్, టైటాన్ వంటి సంస్థలు భారీగా దెబ్బతిన్నాయి. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ సంక్షోభ ప్రభావం మన దేశ బ్యాంకింగ్ రంగం పైన కూడా పడింది.
read more: Driver Salary: నెలకి రూ.2 లక్షలు. ఎవరి డ్రైవర్‌కి? ఎప్పుడు? ఏంటా కథ?
సెన్సెక్స్ ఏకంగా 897 పాయింట్లు కోల్పోయి 58 వేల 237 పాయింట్ల వద్ద ఎండ్ అయింది.నిఫ్టీ 258 పాయింట్లు తగ్గి 17 వేల 154 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్‌లోని మొత్తం 30 కంపెనీల్లో 29 కంపెనీలు అంచనాలు తప్పాయి. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ మోస్తారుగా రాణించింది.
మీడియా సూచీ ఘోరంగా 2 శాతానికి పైగా తగ్గింది. వ్యక్తిగత స్టాక్స్‌ను పరిశీలిస్తే.. టెక్ మహింద్రా షేర్ విలువ 9 శాతానికి పైగా పెరిగింది. ఇన్ఫోసిస్‌కి చెందిన మోహిత్ జోషి.. ఎండీ అండ్ సీఈఓగా పగ్గాలు చేపట్టనుండటం ఈ సంస్థకు కలిసొచ్చింది.
అదానీ గ్రూపులోని 4 కంపెనీల షేర్ల వ్యాల్యూ 5 శాతం అప్పర్ సర్క్యూట్స్‌లో లాక్ అయింది. మార్కెట్ ఇంత వీక్‌గా ఉన్నా కూడా ఇలాంటి పనితీరు కనబరచటం చెప్పుకోదగ్గ విషయమే. అదానీ గ్రూపు.. రుణాలను ముందస్తుగా చెల్లిస్తుండటం.. ప్లస్ పాయింట్‌గా మారుతోందని భావిస్తున్నారు.
10 గ్రాముల బంగారం ధర 811 రూపాయలు పెరిగింది. గరిష్టంగా 56 వేల 961 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. కేజీ వెండి రేటు 11 వంద 37 రూపాయలు లాభపడింది. అత్యధికంగా 64 వేల 27 రూపాయలు పలికింది.
క్రూడాయిల్ ధర 99 రూపాయలు తగ్గింది. ఒక బ్యారెల్ ముడి చమురు 6 వేల 200 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూ 6 పైసలు బలహీనపడింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 82 రూపాయల 16 పైసల వద్ద స్థిరపడింది.