కర్ణాటక సిద్ధరామయ్య ప్రభుత్వం శుక్రవారం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం సినిమా టిక్కెట్లపై ధర పరిమితిని విధించింది. ఏ సినిమా అయినా సరే టికెట్టు ధర రూ.200 మించకూడదని ఆదేశించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ టిక్కెట్లపై ధర పరిమితి రూ.200 మించకూడదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. అన్ని భాషల చిత్రాలకూ ఈ నియమం వర్తిస్తుంది. ఈ నిబంధన ఉల్లంఘించొద్దని మల్టీఫ్లెక్స్‌లకు కూడా ప్రభుత్వం తెలిపింది.
DK Shivakumar: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సీఎం పదవి స్వీకరిస్తారంటూ గత కొంత కాలంగా జోరుగా ప్రచారం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేతో సమావేశం కావడం తీవ్ర చర్చకు దారి తీసింది.
DK Shivakumar: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ముందు కమలం పార్టీ తన ఇంటిని చక్కదిద్దుకోనివ్వండి.. ఆ పార్టీలోని పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలతో టచ్‌లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Kashmiri MBBS Student: కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్‌లో గల అల్-అమీన్ మెడికల్ కాలేజీలో చదువుతున్న కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌కు చెందిన సెకండ్ ఇయర్ MBBS విద్యార్థినిపై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేయడంతో పాటు దాడికి పాల్పడినట్లు తెలుస్తుంది. దీనిపై సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఈ సంఘటనచడ జమ్మూ కాశ్మీర్ స్టూడెంట్స్ అసోసియేషన్ స్పందించింది.
మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా)స్కామ్ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యకు హైకోర్టు నుంచి పెద్ద ఊరట లభించింది. ముడా భూ కేటాయింపు కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని ఆర్టీఐ కార్యకర్త స్నేహమయి కృష్ణ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పిటిషన్‌ను శుక్రవారం హైకోర్టు కొట్టివేసింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన భార్య పార్వతి బీఎంకు ముడా ద్వారా 14 ప్లాట్ల కేటాయింపులో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ముడా భూమి స్కామ్ కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు భారీ ఊరట లభించింది. ఈ కేసును సీబీఐ దర్యాప్తు కోరుతూ ఓ కార్యకర్త దాఖలు చేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. లోకాయుక్త పోలీసుల దర్యాప్తు స్వతంత్రంగా ఉందని పేర్కొంది. ముడా ఇళ్ల స్థలాల కేసును సీబీఐకి అప్పగించాలని సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన కర్ణాటక హైకోర్టు ఆ పిటిషన్ ను కొట్టివేస్తూ కీలక తీర్పు వెలువరించింది.…
MUDA scam: కర్ణాటకలో సంచలనంగా మారిన మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(ముడా) కుంభకోణంలో సీఎం సిద్ధరామయ్యతో పాటు ఆయన భార్యకు సంబంధం ఉందని ఈడీ పేర్కొంది. సిద్ధరామయ్య, ఆయన భార్య, ఆయన కుటుంబ సభ్యులకు ఈ స్కామ్లో సంబంధం ఉందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వెల్లడించింది. ప్రభుత్వం సేకరించిన భూమిని అక్రమంగా డీ-నోటిఫై చేయడం, మోసపూరిత భూమి మార్పిడి , సుమారు రూ.56 కోట్ల విలువైన సైట్
జైన సన్యాసి గుణధర్ నంది మహారాజ్ మాట్లాడుతూ.. నాకు రెండు కలలు ఉన్నాయి.. ఒకటి జైన డెవలప్‌మెంట్ కార్పొరేషన్ బోర్డు ఏర్పాటు చేయడం, ఇంకోటి డీకే శివ కుమార్ ముఖ్యమంత్రి కావాలని పేర్కొన్నారు.
కనుమ పండుగ రోజున కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు చుక్కెదురైంది. ముడా కుంభకోణం కేసులో దర్యాప్తు కొనసాగించాలని లోకాయుక్తకు కర్ణాటక హైకోర్టు ఆదేశించింది.
Belagavi: మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న కర్ణాటకలోని బెలగావి నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని శివసేన (యూబీటి) నేత ఆదిత్య ఠాక్రే డిమాండ్ చేశారు. దీనిపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మండిపడ్డారు. ఇది చిన్న పిల్లల ప్రకటనలా ఉందన్నారు.