కర్ణాటక సిద్ధరామయ్య ప్రభుత్వం శుక్రవారం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం సినిమా టిక్కెట్లపై ధర పరిమితిని విధించింది. ఏ సినిమా అయినా సరే టికెట్టు ధర రూ.200 మించకూడదని ఆదేశించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ టిక్కెట్లపై ధర పరిమితి రూ.200 మించకూడదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. అన్ని భాషల చిత్రాలకూ ఈ నియమం వర్తిస్తుంది. ఈ నిబంధన ఉల్లంఘించొద్దని మల్టీఫ్లెక్స్‌లకు కూడా ప్రభుత్వం తెలిపింది.
READ MORE: Jio Recharge Plan: 90 రోజుల వ్యాలిడిటీ.. రోజుకు 2GB డేటా.. ఉచిత OTT యాప్‌లతో అద్భుతమైన ప్లాన్
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చిత్రనిర్మాతలకు ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. సాధారణంగా ఏదైనా సినిమా థియేటర్లలో విడుదలైనప్పుడు.. వారి సౌకర్యాన్ని బట్టి టికెట్ ధరను నిర్ణయించుకుంటారు. సినిమా హాళ్లలో జనం పెరిగేకొద్దీ టిక్కెట్ల ధరలు కూడా పెరుగుతాయి. మల్టీప్లెక్స్‌లలో టిక్కెట్ల ధర సాధారణ సినిమా హాళ్ల కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ నిర్ణయం వల్ల ఇప్పుడు అన్ని సినిమా హాళ్లు ఎదురు దెబ్బగా భావిస్తున్నాయి.
READ MORE: Sajjala Ramakrishna Reddy: వైసీపీ ముఖ్యనేతలతో సజ్జల టెలీకాన్ఫరెన్స్.. కీలక ఆదేశాలు
కాగా.. అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్ని సినిమా హాళ్లలో టికెట్ ధరను రూ.200కే పరిమితం చేస్తామని నొక్కి చెప్పారు. గతంలో ఇలాంటి ధరల పరిమితి విధించినప్పటికీ.. దానిని కఠినంగా అమలు చేయలేదు. గత కొన్ని సంవత్సరాలుగా బెంగళూరులో టిక్కెట్ల ధరలు బాగా పెరిగాయి. కొన్ని సినిమాలు వాటి మొదటి విడుదల రోజుల్లో రూ. 600 కంటే ఎక్కువ ధరకు అమ్ముడయ్యాయి. సందర్శకులకు సినిమాను మరింత సరసమైనదిగా చేయడానికి.. ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా టిక్కెట్ల ధరలను ప్రామాణీకరించాలని నిర్ణయించింది. ఈ కొత్త నిబంధన త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అమలు కానుంది.