Liquor Shops Closed: మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్. ఎక్సైజ్ అధికారుల దోపిడిని ఆరికట్టాలంటూ కన్నడ రాష్ట్రంలో లిక్కర్ షాప్స్ ఓనర్స్ ఆందోళన బాట పట్టబోతున్నారు. ఈ సందర్భంగా కర్ణాటకలోని మద్యం దుకాణాలు నవంబరు 20వ తేదీన మూత పడబోతున్నాయి.
DK Shivakumar: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రజాదరణకు భయపడి ఆయనపై బీజేపీ నిందలు వేస్తోందని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. సిద్ధరామయ్య పవర్ఫుల్ మాస్ లీడర్, ఆయనతో సహా దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలకు చెందిన బలమైన ప్రజానాయకులందర్ని అంతమొందించాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బెంగళూర్‌లో శుక్రవారం తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రైతు రుద్దరప్ప ఆత్మహత్యను వక్ఫ్ భూములకు ముడి పెడుతూ పోస్టు పెట్టి.. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారనే ఆరోపణలతో బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యతో పాటు రెండు కన్నడ పత్రికల ఎడిటర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.
మైసూరు భూ కుంభకోణం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లోకాయుక్త సమన్లు జారీ చేసింది. బుధవారం విచారణకు రావాలని సమన్లలో పేర్కొంది. దీంతో మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా)కు సంబంధించిన కేసులో ముఖ్యమంత్రిని లోకాయుక్త ప్రశ్నించనుంది.
Siddaramaiah: హిందుత్వ సిద్ధాంతకర్తలు వినాయక్ దామోదర్ సావర్కర్, ఆర్ఎస్ఎస్ నాయకుడు ఎంఎస్ గోల్వాల్కర్ భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించారని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. గురువారం బెంగళూర్‌లోని కర్ణాటక కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ(కేపీసీసీ) కార్యాయలంలో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరి గురించి ప్రజలు తెలుసుకోవాలని కోరారు.
పాకిస్తాన్ గడ్డపైనే ఆ దేశానికి వార్నింగ్ ఇచ్చిన జైశంకర్.. షాంఘై సహకార సంస్థ (ఎస్సిఓ) శిఖరాగ్ర సమావేశం పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరుగుతోంది. బుధవారం ఎస్సీఓ మీటింగ్స్ ప్రారంభమయ్యాయి. భారతదేశం తరుపున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ నిన్న ఇస్లామాబాద్ వెళ్లారు. ఇదిలా ఉంటే, పాకిస్తాన్ గడ్డపైనే ఆ దేశానికి జైశంకర్ చురకలంటించారు. రెండు దేశాల మధ్య సరిహద్దు కార్యకలాపాలు ఉగ్రవాదం, వేర్పాటువాదంతో కూడి ఉంటే, అది ద్వైపాక్షిక వాణిజ్యం, సంబంధాలు సహాయపడేందుకు సహకరించవని అన్నారు. ‘‘అభివృద్ధి,…
MUDA Scam: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో పాటు ఆయన భార్య పార్వతి మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) స్కామ్‌లో చిక్కుకున్నారు. ఇప్పటికే హైకోర్టు ఆదేశాల మేరకు సిద్ధరామయ్యపై లోకాయుక్త విచారణ ప్రారంభించింది.
BJP: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య బీజేపీ ఎంపీ, కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషిని ‘‘టెర్రరిస్ట్’’ అని పిలవడంపై వివాదం మొదలైంది. సీఎం వ్యాఖ్యలకు కౌంటర్‌గా ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. ‘‘ ఆయనకు మెంటల్ ట్రీట్మెంట్ అవసరం’’ అని అన్నారు. దీనికి ముందు ఆదివారం సిద్ధరాయమ్య హుబ్బల్లి అల్లర్లలో నిందితులైన మైనారిటీ వ్యక్తులపై కేసులు విత్ డ్రా అంశంపై మాట్లాడారు.