Karnataka Results: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గ్రాండ్ విక్టరీ కొట్టింది.. సర్వేలు, ఎగ్జిట్‌పోల్స్‌కు మించి మెజార్టీ సీట్లు సాధించే దిశగా దూసుకుపోతోంది.. ఇప్పటికే 137 స్థానాల్లో విజయాన్ని ఖరారు చేసుకున్న ఆ పార్టీ.. మరికొన్ని స్థానాల్లో విజయం ఖాయం అంటోంది.. ఇదే సమయంలో.. మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీజేపీ, విపక్ష జేడీఎస్ రెండూ కలిసినా.. ఏమీ చేయలేని పరిస్థితి.. ఇంత వరకు బాగానే ఉంది.. ఊహించని మెజార్టీ అందుకున్న కాంగ్రెస్ పార్టీలో సీఎం…
Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కర్ణాటకలో సాధించిన విజయంపై హర్షం వ్యక్తం చేశారు. తమ పార్టీ భారీ విజయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని చెప్పారు. కర్ణాటక ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ద్వేషంతో చేసే రాజకీయాలు ముగిశాయని పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రేమతో విజయం సాధించామని అన్నారు. న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ద్వేషం యొక్క మార్కెట్ మూసివేయబడింది మరియు ప్రేమ దుకాణాలు తెరవబడ్డాయి" అని ఆయన అన్నారు.
Siddaramaiah: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించబోతోంది. 139 స్థానాల్లో ఇప్పటికే లీడింగ్ లో ఉంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో సంబరాలు నెలకొన్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో రాహుల్ గాంధీ దేశానికి ప్రధాని కావాలని ఆశిస్తున్నట్లు సిద్దరామయ్య అన్నారు. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగిన రాహుల్ గాంధీ 2024లో ప్రధాని అవుతారని కాంగ్రెస్ అధినేత ఆశాభావం వ్యక్తం చేశారు.
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ అధికార, విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ నేతలు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే కర్ణాటకలో రిజర్వేషన్ల పరిమితిని 50 శాతం నుంచి 75 శాతానికి పెంచుతామని కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ప్రకటించడంపై ఘాటుగా స్పందించారు మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప.
'అవినీతి లింగాయత్ ముఖ్యమంత్రి' అంటూ బసవరాజ్ బొమ్మైపై కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్య రాజకీయ దుమారం రేపింది. అయితే, సిద్ధరామయ్య వ్యాఖ్యలను ఇటీవల కాంగ్రెస్ లో చేరిన లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన నేత జగదీశ్ షెట్టార్ సమర్థించారు.
కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య 'అవినీతి రహిత లింగాయత్ ముఖ్యమంత్రి' అంటూ బసవరాజ్ బొమ్మైపై దుమ్మెత్తిపోయడం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు దుమారం రేపింది. ఇది లింగాయత్ ఓట్ల శాతంపై ఎలాంటి ప్రభావం చూపబోతోందో అనే అంశంపై చర్చ మొదలైంది.
కర్ణాటకలో అధికారం కోపం కాంగ్రెస్, బీజేపీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న అధికారాన్ని కొనసాగించాలని కాషాయ పార్టీ నేతలు భావిస్తుండగా.. మెజార్టీ సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని హస్తం నేతలు యోచిస్తున్నారు. మే 10న జరగనున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ అంశం ప్రభావం చూపదని కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య అన్నారు.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సూడాన్‌లో చిక్కుకున్న కర్ణాటకకు చెందిన 31 మంది గిరిజనులపై చేసిన వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి శంకర్ ఈ సాయంత్రం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సిద్ధరామయ్యపై తీవ్రంగా మండిపడ్డారు.
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో సమయం దగ్గర పడిన నేపథ్యంలో అభ్యర్థులు ప్రచారంలో స్పీడ్ పెంచారు. నియోజకవర్గాల్లో తిరుగుతూ ఓట్ల కోసం అభ్యర్థిస్తున్నారు. ఈ క్రమంలో కొందరికి నిరసన సెగ ఎదురవుతోంది. మే 10న కర్ణాటకలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్యతో తలపడనున్న బీజేపీ నేత వీ సోమన్నకు ఈరోజు ప్రచార పర్వంలో ఇబ్బంది ఎదురైంది.
సూడాన్‌లో దేశ సైన్యం, పారామిలిటరీల మధ్య తీవ్రమైన పోరు జరుగుతోంది. ఈ పోరులో దాదాపు 200 మంది మరణించారు. సుమారు 1,800 మంది గాయపడ్డారు. అయితే, కర్ణాటక నుండి వెళ్లిన 31 మంది వ్యక్తులు సూడాన్‌లో చిక్కుకున్నారు.కర్ణాటక రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (KSDMA) వారు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సమాచారం అందించారు.