Karnataka: కర్ణాటక ముఖ్యమంత్రి పీఠం కోసం గట్టి పోటీ.. సిద్ధూ, డీకేల్లో సీఎం ఎవరో?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి అందరికి తెలిసిందే. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి పీఠం ఎవరికి దక్కుతుందనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ అంశంపై చర్చించేందుకు కాంగ్రెస్ ఈ సాయంత్రం తన ఎమ్మెల్యేల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. బెంగళూరులోని షాంగ్రీ-లా హోటల్‌లో సాయంత్రం 6 గంటలకు జరగనుంది. ముఖ్యమంత్రి ఎంపికను నిర్ణయించడానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడికి వదిలివేసే తీర్మానాన్ని కాంగ్రెస్ శాసనసభా పక్షం ఆమోదించాలని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇద్దరూ ఉన్నత పదవి కోసం ఎదురుచూస్తున్నారు. ఈ విషయం పరిష్కరించబడకపోతే పార్టీలో ప్రతిష్టంభన ఏర్పడుతుందనే భయాలు కాంగ్రెస్ పార్టీలో మొదలైనట్లు తెలుస్తోంది.
ఈ విజయాన్ని రాష్ట్ర ప్రజలకు అంకితం చేస్తూ, పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న సంక్షేమ పథకాలను అమలు చేస్తానని హామీ ఇస్తూ శనివారం సాయంత్రం పార్టీ అగ్రనేతలతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే.. ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. సోనియా గాంధీని కలవనున్నారు. ఈరోజు బెంగళూరులో జరిగే భారీ సమావేశానికి ఆయన హాజరుకావడం లేదు. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఇప్పటికే బెంగళూరు చేరారు. అధిష్టానం ఎవరికి ఓటేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. వెనుకబడిన వర్గానికి చెందిన సిద్ధరామయ్య సీఎం రేసులో ముందంజలో ఉన్నట్టు చెబుతున్నారు. అయితే పార్టీని అధికారంలోకి తేవడంలో ట్రబుల్ షూటర్ శివకుమార్ కూడా తీవ్రంగా శ్రమించారు. పైగా 61 ఏళ్ల డీకేకు గాంధీ కుటుంబం ఆశీస్సులున్నాయి. అయితే పార్టీ నేతల్లో అత్యధికుల మద్దతు సిద్ధరామయ్యకు ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read
- Number Secrete: మొబైల్ నంబర్‌కు ముందు '+91' ఎందుకు ఉంటుందో తెలుసా..? ఆ రహస్యం ఇదే..
- PM Modi: ‘రూల్ టేకర్’ కాదు, ‘రూల్ షేపర్’గా మారాలి.. బ్రిక్స్ వేదికపై మోదీ పిలుపు
- SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
- Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్‌పింగ్ భేటీలో కీలకాంశాలు..
Read Also: Minister KTR: కర్ణాటక ఫలితాలు తెలంగాణపై ఎటువంటి ప్రభావం చూపలేవు
వీరిద్దరి మధ్య వివాదాలకు తావు లేని రీతిలో అధికార పంపిణీ చేయాలని అధిష్ఠానం యోచనగా చెబుతున్నారు. ఇకపై ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించిన 75 ఏళ్ల సిద్ధరామయ్యకు ముఖ్యమంత్రి, డీకేకు డిప్యూటీ, లేదా కీలక మంత్రి పదవి ఇచ్చి కొంతకాలానికి వారిని పరస్పరం మారుస్తారని భావిస్తున్నారు. దళిత నేత వైపు అధిష్ఠానం మొగ్గితే పరమేశ్వరకు ఛాన్స్ ఉంటుంది.
తాజావార్తలు
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్‌కు భారీ రద్దీ.. ట్రాఫిక్ పోలీసుల బిగ్ ప్లాన్
-
Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
-
Ponguleti Srinivas Reddy : 22Aపై రచ్చ.. BRSపై పొంగులేటి ఫైర్..!
-
Krithi Shetty: కోలీవుడ్‌లో బేబమ్మకు దక్కని హిట్.. రిలీజ్ ఎప్పుడో తేలని రూ.100 కోట్ల సినిమా!
-
Ak 47 : ‘ఆదర్శ కుటుంబం’ చేతిలో AK47.. వెంకీ-త్రివిక్రమ్ మార్క్ మాస్ టీజర్ వచ్చేసింది!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!