కర్ణాటక సీఎం ఎవరనే విషయంపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. పార్టీ తనకు తల్లి లాంటిదని, వెన్నుపోటు పొడవబోనని, బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడనని హస్తినకు వెళ్లటానికి ముందు డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు కూడా అందుకు కారణమని ఏఐసీసీ వర్గాలు అంటున్నాయి.
Karnataka CM Post: కర్ణాటకలో కాంగ్రెస్ భారీ విజయం సాధించింది. ఎన్నాళ్ల నుంచో విజయాల కోసం మోహంవాచేలా ఎదురుచూస్తున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. కర్ణాటక అసెంబ్లీలో 224 స్థానాల్లో 135 కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే గెలిచినా.. కాంగ్రెస్ పార్టీని సీఎం పోస్టు ఎవరికివ్వాలనే అంశం తలనొప్పిగా మారింది. పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యల మధ్య ఆధిపత్య పోరు కనిపిస్తోంది. ఈ పంచాయతీ ఢిల్లీకి చేరింది. ఏఐసీసీ…
DK Shivakumar: కర్ణాటకలో ఎన్నికలలో 34 ఏళ్ల రికార్డును తిరగరాస్తూ కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని సాధించింది. మెజారిటీ ఓట్లు, సీట్లను రాబట్టింది. మొత్తం 224 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న కర్ణాటకలో ఏకంగా 135 స్థానాల్లో జయకేతనం ఎగరేసింది. అధికారంలో ఉండీ కూడా బీజేపీ కేవలం 66 స్థానాలకే పరిమితం అయింది. కింగ్ మేకర్ అవుతామనుకున్న జేడీఎస్ కేవలం 19 స్థానాల్లో గెలిచింది. 2024 లోక్ సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక విజయం మంచి…
Karnataka Politics: కర్ణాటక సీఎం పదవి వ్యవహారం ఢిల్లీకి చేరింది. కర్ణాటకలో కాంగ్రెస్ గ్రాండ్ విక్టరీ సాధించినా.. సీఎం అభ్యర్థి ఎవరనేది తేలడం లేదు. పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇద్దరు కూడా సీఎం అభ్యర్థిత్వాన్ని కోరుకోవడం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఇదిలా ఉంటే సీఎం రేసులో మరికొందరి పేర్లు వినిపిస్తున్నాయి. తమ నేతకే సీఎం పదవి కావాలని కాంగ్రెస్ లీడర్ జీ పరమేశ్వర అనుచరులు తుమకూరులో…
కాంగ్రెస్ హైకమాండ్ నుంచి తనకు పిలుపు వచ్చిందని కేపీసీసీ చీఫ్ డీకే శివ కుమార్ తెలిపారు. తనకు ఇవాళ ( సోమవారం ) ఆరోగ్యం బాగలేకపోవడంతో రాలేక పోయానంటూ ఆయన వెల్లడించారు. రేపు ( మంగళవారం ) ఉదయం 7 గంటల నుంచి 8 గంటల మధ్య ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తుంది.
సీఎం పీఠం విషయంలో పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ పార్టీ హైకమాండ్కు మరోసారి గట్టి సంకేతాలు పంపించారు. ఒంటరిగానే 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించానని ఆయన చెప్పారు. కాంగ్రెస్లో నాకంటూ ఓ వర్గం లేదు.. ఎమ్మెల్యేలంతా నా వాళ్లే.. ఒంటరిగానే కాంగ్రెస్కు 135 సీట్లు తెచ్చిపెట్టా.. పైగా కాంగ్రెస్ చీఫ్(మల్లికార్జున ఖర్గేను ఉద్దేశించి..) నావైపే ఉన్నారు. నా బలాన్ని ఎవరూ లాక్కోలేరు అని డీకే అన్నాడు.
కర్ణాటకలో ఉన్న డీకే శివ కుమార్ కాంగ్రెస్ హైకమాండ్ కు గట్టి సంకేతాలు ఇస్తున్నాడు. ఇప్పటికే ఆయన తన మద్దతుదారులతో సమావేశం అయిన అనంతరం డీకే ప్రెస్మీట్ పెట్టి మరీ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
కాంగ్రెస్ నేతలంతా గెలుపు కోసం సహకరించారని డీకే శివ కుమార్ అన్నారు. నాకు సిద్ధరామయ్యతో ఎలాంటి విభేదాలు లేవు అని డీకే వెల్లడించారు. నా పుట్టిన రోజు వేడుకల్లో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా పాల్గొన్నారు అని ఆయన అన్నారు. నాకంటూ ఉన్న మద్దతుదారుల సంఖ్యను నేను చెప్పను అంటూ ఆయన చెప్పారు.