కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రతిపక్ష నేత సిద్ధరామయ్యకు వచ్చిన బెదిరింపు కాల్స్‌పై విచారణకు ఆదేశించినట్లు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై శుక్రవారం తెలిపారు. తాను కాంగ్రెస్ నాయకుడిని కలిశానని, తగిన భద్రతతో పాటు సమగ్ర విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చానని తెలిపారు.
గోవాలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. అక్కడి కాంగ్రెస్ సీఎం అభ్యర్థి దిగంబర్ కామత్‌తో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ ఉన్నారన్న వార్తలు దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. గోవాలో కాంగ్రెస్ నేతలను బీజేపీ ప్రలోభాలకు గురిచేస్తోందని, తమ పార్టీలో చేరితో రూ. 50 కోట్లు ఇస్తామంటూ కాషాయ పార్టీ కాంగ్రెస్ నేతలకు ఆఫర్ చేసిందని ఆయన ఆరోపించారు. కేవలం ఒక్క గోవాలోనే కాదు.. ప్రతీ…
కర్ణాటకలో మరోసారి రాజకీయాలు చేయడానికి మరో కొత్త అంశం దొరికింది. తాజాగా కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య చేసిన వ్యాఖ్యలపై రచ్చ నడుస్తోంది. తాను హిందువునని.. ఇప్పటి వరక బీఫ్ తినలేదని.. కావాలనుకుంటే బీఫ్ తింటా అని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో మరోసారి కర్ణాటకలో అధికార బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం ప్రారంభం అయింది. ఆర్ఎస్ఎస్ మతాల మధ్య అడ్డుగోడలు నిర్మిస్తోందని తుముకూరులో జరిగిన ఓ సభలో వ్యాఖ్యానించారు. బీఫ్…
ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు సహా 60 మందికి పైగా బెదిరింపులు రావడం.. ఏ క్షణంలోనైనా చంపేస్తామంటూ ఆ లేఖల్లో వార్నింగ్ ఇవ్వడం కర్ణాటకలో కలకలం రేపుతోంది… మాజీ సీఎంలు సిద్ధరామయ్య, హెచ్డీ కుమార స్వామితో పాటు 61 మంది రచయితలకు ఈ లేఖలు వచ్చినట్టుగా తెలుస్తోంది.. ఆ లేఖలు ఎవరు పంపించారనేది తలియాల్సి ఉన్నా.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ లేఖలు రచ్చగా మారాయి.. ఆ లేఖల చివర్లో ఓ సహనం కలిగిన హిందువు అంటూ రాసి…