వైఎస్ షర్మిల పాదయాత్ర అనుమతికి పోలీస్ కు విధించిన 48 గంటల గడువు నేటితో పూర్తైంది. అయితే పాదయాత్ర అనుమతిపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఇవాళ నర్సంపేట ఏసీపీ వద్దకు YSRTP నేతలు చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు నర్సంపేట ACP ను YSRTP నేతలు కలవనున్నారు.
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ.పాల్ వైఎస్ ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిలపై తీవ్ర వ్యాఖ్యలు. రాష్ట్రానికి రాజన్న రాజ్యాన్ని ప్రవేశపెడతానంటూ షర్మిల పాదయాత్ర చేయాల్సిన అవసరం లేదని అన్నారు.
వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర ఇవాల్టి నుంచి మళ్లీ ప్రారంభం కానుంది. ఎక్కడైతే తనను అరెస్ట్ చేశారో అక్కడినుంచే ఆమె పాదయాత్ర మొదలు పెట్టనున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట లింగగిరి నుంచి పాదయాత్ర కొనసాగిస్తారు.
తెలంగాణలో ఇంకా కుదురుకోలేదు. పాదయాత్ర పేరుతో ఖమ్మం జిల్లాను చుట్టేస్తున్నారు వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల. తాజాగా ఆమె ఎక్కడినించి పోటీచేస్తానో క్లారిటీ ఇచ్చేశారు. పాలేరు పై షర్మిల కన్ను వెనుక వ్యూహం ఏంటని అంతా చర్చించుకుంటున్నారు. పాలేరు కాంగ్రెస్ కు పెట్టని కోట. అక్కడ కాంగ్రెస్ కు ఎప్పుడూ గెలుపు నల్లేరు మీద బండి నడకే. కాంగ్రెస్ గెలుపు షర్మిలకు కలసి రానుందంటున్నారు. టీఆర్ఎస్ వర్గ పోరు షర్మిలకు కలసి రానుందనేది మరో వర్గం…