Sharmila Padayatra: వైఎస్ షర్మిల పాదయాత్ర అనుమతికి పోలీస్ కు విధించిన 48 గంటల గడువు నేటితో పూర్తైంది. అయితే పాదయాత్ర అనుమతిపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఇవాళ నర్సంపేట ఏసీపీ వద్దకు YSRTP నేతలు చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు నర్సంపేట ACP ను YSRTP నేతలు కలవనున్నారు. పాదయాత్రకి అనుమతి ఇస్తారా..? లేదా? అనేదానిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. డిసెంబర్ 14న పాదయాత్ర ముగిస్తామని, దాదాపు 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నాం ” అని వైఎస్ షర్మిల పేర్కొన్న విషయం తెలిసిందే.
Read also: CM Jagan : పార్టీ నేతలతో నేడు సీఎం జగన్ సమీక్ష
తెలంగాణలో వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలపై స్పందించిన వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వైఎస్ షర్మిల పాదయాత్ర వల్ల నర్సంపేటలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిందని, పాదయాత్రకు అనుమతి ఎందుకు నిలుపుదల చేయకూడదో ఆమె వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన లేఖలో పేర్కొన్నారు. షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర కారణంగా నర్సంపేటలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిందని, ఎందుకు పాదయాత్రకు అనుమతి నిరాకరించకూడదో చెప్పాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఇక తాజాగా.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో సీపీ రంగనాథ్ ను వైయస్ఆర్ తెలంగాణ పార్టీ లీగల్ టీం సభ్యులు కలిశారు. వైయస్ షర్మిల పాదయాత్ర కు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుమతి ఇవ్వాలని సీపీ రంగనాథ్ కు తెలిపి సీపీ షోకాజ్ నోటీసులకు వివరణ ఇచ్చారు. ఈ వార్తలపై స్పందించి వైఎస్ షర్మిల పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని కోరగా, వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ రెండు రోజుల గడువు కోరారు. నేటితో ఆగడు పూర్తీ కావడంతో మరి షర్మల పాదయాత్రకు అనుమతి ఇవ్వనుందా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.