ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు పన్నినా ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తాం అన్నారు వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతి, అక్రమాలను ఎండగడతాం. ప్రజాప్రస్థానం ప్రజల కోసమే చేపట్టిన పాదయాత్రలో షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వచ్చిన 8 ఏళ్లుగా కేసీఆర్ చేస్తున్నది మోసమే అన్నారు. కేసీఆర్ ప్రతి పథకం మోసమే.. కేసీఆర్ ఇచ్చిన ప్రతి హామీ బూటకమే అన్నారు. రెండు సార్లు సీఎంగా ఎన్నుకుంటే బాగుపడిన వర్గం లేదు. వ్యవసాయానికి గౌరవం లేదు..పండించిన పంటకు విలువ లేదన్నారు.
పండించిన పంటకు మద్దతు ధర లేదు.. వైఎస్సార్ హయాంలో వ్యవసాయానికి భరోసా ఉండేది.. ఇప్పుడు పంట నష్టం జరిగితే పరిహారం ఇచ్చే దిక్కు లేదు. వ్యవసాయానికి అన్ని పథకాలు బంద్ పెట్టి ముష్టి 5వేలు రైతు బందు ఇచ్చి గొప్పలు చెప్తున్నారని షర్మిల మండిపడ్డారు. రుణమాఫి చేయక ..ఆ రైతుబంధు కాస్త బ్యాంకుల్లోనే కట్టాల్సి వస్తుంది. వైఎస్సార్ హయాంలో రేషన్ షాపుల్లో నిత్యావసర వస్తువులు సైతం ఇచ్చే వారు.. ఇప్పుడు కేసీఆర్ దొడ్డు బియ్యం ఇస్తూ అన్ని బంద్ పెట్టారు.. ఇంటికి పెద్ద కొడుకు అని చెప్పి ఇంట్లో ఒకరికి మాత్రమే పెన్షన్ ఇస్తున్నాడు. ఇంట్లో ఒకరికే పెన్షన్ ఇస్తే సరిపోతుందా?
Read Also: The Life Of Muthu Review: ద లైఫ్ ఆఫ్ ముత్తు
పెద్ద కొడుకు అయితే ఇంట్లో ఒకరికే బోజనం పెడతారా? బంగారు తెలంగాణ అని చెప్పి బ్రతుకే లేని తెలంగాణగా మార్చారు. బంగారు తెలంగాణ అని చెప్పి బార్ల తెలంగాణ..బీర్ల తెలంగాణ చేశారు.. తెలంగాణ లో ప్రశ్నిస్తే కేసులు.. పెట్టడం ..ఇబ్బందులు పెట్టడం తప్ప మరోటి లేదు. ఇది దొంగల రాజ్యం ..దోపిడి రాజ్యం.. 16వేల కోట్ల మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని 4లక్షల కోట్ల అప్పుల కుప్ప చేశారని వైఎస్ షర్మిల దుయ్యబట్టారు. తెచ్చిన అప్పులన్ని మొత్తం కేసీఅర్ ఇంట్లోకి పోయాయి. కాళేశ్వరం పేరు చెప్పి కమీషన్లు తిన్నారు.. కేసీఅర్ కి..ఇక్కడున్న మంత్రికి..ఎమ్మెల్యే లకు అయ్యింది బంగారు తెలంగాణ.
పాలమూరు కి వైఎస్సార్ హయాంలో లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాడు.. ఇప్పుడు కేసీఅర్ ఒక్క ఎకరాకు కూడా నీళ్ళు ఇవ్వలేదు.. కేసీఅర్ కి పరిపాలన చేతకాదు..ఏమి చేతకాని కేసీఅర్ ముఖ్యమంత్రి పదవికి అనర్హుడు..ప్రజలను కేవలం ఒట్లేసే మిషన్లు గా మార్చాడు..ఎన్నికలు వస్తే పథకాల పేరు చెప్పి స్విచ్ వేస్తాడు..ఎన్నికలు అవ్వగానే స్విచ్ ఆఫ్ చేసి ఫామ్ కి వెళ్లి పోతాడు..ఈసారి భారీగా ఓట్లకు డబ్బులు ఇస్తాడట.. ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి.. అవన్నీ మీ డబ్బులే అన్నారు. డబ్బులు తీసుకొని.. మీకోసం పాటు పడే పార్టీకి ఓట్లు వేయండి.. వైఎస్సార్ సంక్షేమం కోసమే పార్టీ పెట్టానన్నాను షర్మిల. బీజేపీ,కాంగ్రెస్ లు కేసీఅర్ ను విమర్శించడంలో విఫలం అయ్యాయి. కేసీఅర్ అవినీతికి పాల్పడుతుంటే కనీసం ప్రశ్నించడం లేదు.
అన్ని పార్టీలు ఓకే తాను ముక్కలు..వారి స్వార్థం కోసమే రాజకీయాలు చేస్తున్నాయి.. తెలంగాణ గడ్డపై వైఎస్ఆర్ పాలన కోసమే పార్టీ పెట్టానని స్పష్టం చేశారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ కొత్త పార్టీ…కానీ వైఎస్సార్ మాత్రం కొత్త కాదు.. వ్యవసాయాన్ని పండుగ చేస్తానని హామీ ఇచ్చారు. ఇళ్ళు లేని ప్రతి పేద కుటుంబానికి మహిళ పేరు మీద పక్కా ఇల్లు కట్టిస్తానన్నారు. వైఎస్సార్ ప్రతి పథకాన్ని బ్రహ్మాండంగా అమలు చేస్తానన్నారు. ఇంట్లో ఎంత మంది వృద్దులు ఉంటే అందరికీ పెన్షన్ ఇచ్చే బాధ్యత తనదన్నారు వైఎస్ షర్మిల.
Read Also: Maharashtra: ప్రభుత్వం చేయలేని పని.. 19 ఏళ్ల యువతి చేసింది..!!