మాజీ ప్రధానులు కొత్త భారతదేశాన్ని రూపొందించడానికి పనిచేశారని, అయితే ప్రధాని నరేంద్ర మోడీ ఇతరులను మాత్రమే విమర్శిస్తున్నారని, గత పదేళ్లలో తన ప్రభుత్వం ప్రజలకు చేసిన వాటి గురించి మాట్లాడలేదని ఎన్సీపీ(ఎస్పీ) నాయకుడు శరద్ పవార్ సోమవారం అన్నారు.
Bharat Jodo Nyay Yatra: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన రెండో రోజు ఇండియా కూటమి బలప్రదర్శన నిర్వహించింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ ఈ రోజు ముంబైలో ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమానికి ఇండియా కూటమి నేతలు హాజరయ్యారు. 63 రోజుల పాటు జరిగిన ఈ యాత్ర ముగింపు వేడుకలు ముంబైలోని శివాజీ పార్క్‌లో జరిగాయి. ఈ కార్యక్రమానికి తేజస్వీ యాదవ్, ఎంకే స్టాలిన్, మల్లికార్జున్ ఖర్గే, శరద్ పవార్,…
సార్వత్రిక ఎన్నికల వేళ అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి సుప్రీంకోర్టు షాకిచ్చింది. ఎన్నికల ప్రచారంలో శరద్ పవార్ ఫొటో, పేరు ఉపయోగించొద్దని ఎన్సీపీకి న్యాయస్థానం ఆదేశించింది.
Sharad Pawar: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇండియా కూటమిలో ఉన్న శరద్ పవార్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేతో పాటు డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్లను మార్చి 2న లంచ్‌కి రావాల్సిందిగా ఆహ్వానించారు. తన సొంత ప్రాంతం బారామతిలోని తన నివాసంలో జరిగే కార్యక్రమానికి ఆహ్వానం పంపారు. శరద్ పవార్ రాజకీయ ప్రత్యర్థులైన వీరికి ఆహ్వానం పంపండం ప్రాధాన్యతన సంతరించుకుంది.
Maharashtra Politics: మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఎన్సీపీ పార్టీలో చీలికలు వచ్చాయి. శరద్ పవార్, అజిత్ పవార్ రెండు వర్గాలుగా విడిపోయారు. ఇటీవల ఈసీ, మహారాష్ట్ర స్పీకర్ నిజమైన ఎన్సీపీ అజిత్ పవార్‌దే అని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పవార్ కుటుంబంలో ఇద్దరు మహిళల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది.
మహారాష్ట్రంలోని రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్‌కి మరోసారి షాక్ తగిలింది. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీనే నిజమైన పార్టీ అని మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నార్వేకర్ స్పష్టం చేశారు.
NCP: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) పార్టీ వివాదంలో మరోసారి శరద్ పవార్‌కి షాక్ తగిలింది. నిజమైన ఎన్సీపీ అజిత్ పవార్‌దే అని మహారాష్ట్ర స్పీకర్ స్పష్టం చేశారు. అజిత్ పవార్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేది లేదని స్పీకర్ రాహుల్ నార్వేకర్ తేల్చి చెప్పాడు. అజిత్ పవార్ వర్గానికి 41 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, శరద్ పవార్ వర్గానికి 12 మంది ఎమ్మెల్యేల వర్గం ఉందని ఆయన చెప్పారు.