NCP: అజిత్ పవార్ ఎన్సీపీలో కలవరం.. శరద్ పవార్‌కి టచ్‌లో 10-15 ఎమ్మెల్యేలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NCP: మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి ఘోరపరాజయం ఆ కూటమిలోని పార్టీలకు ఇబ్బందికరంగా మారాయి.ముఖ్యంగా ఎన్సీపీలో లుకలుకలు బయటపడుతున్నాయి. అజిత్ పవార్ ఎన్సీపీ వర్గానికి చెందిన దాదాపు 10-15 మంది ఎమ్మెల్యేలు శరద్ పవార్ శిబిరంతో టచ్‌లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, వీటిని అజిత్ పవార్ వర్గం కొట్టిపారేసింది. లోక్‌సభ ఎన్నికల్లో అజిత్ పవార్ వర్గం కేవలం ఒకే ఎంపీ సీట్లు దక్కించుకుంది. అయితే, శరద్ పవార్ వర్గం ఏకంగా 08 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. ఈ నేపథ్యంలో మరికొన్ని రోజుల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు రానుండటంతో రాజకీయాలు కీలక మలుపు తీసుకుంటున్నాయి.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
అజిత్ పవార్ వర్గానికి చెందిన పలువురు నేతలు తమతో టచ్‌లో ఉన్నట్లు ఎన్సీపీ(శరద్ పవార్) రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ అన్నారు. మహారాష్ట్రలో గందరగోళం మధ్య అసంతృప్త నేతలను శాంతింపచేయడానికి ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మంత్రివర్గం విస్తరణ చేయవచ్చనే సమచారం ఉంది. ఈ ఎన్నికల్లో అజిత్ పవార్ వర్గం 04 లోక్‌సభ స్థానాలకు పోటీ చేస్తే కేవలం 01 స్థానాన్ని గెలుచుకుంది. అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ బారామతి లోక్‌సభ స్థానం నుంచి శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే చేతిలో 1.5 లక్షల ఓట్లతో ఓడిపోయారు. మరోవైపు ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ(శివసేన-ఉద్దవ్, ఎన్సీపీ-శరద్ పవార్, కాంగ్రెస్) కూటమి ఏకంగా 48 సీట్లలో 30 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 13 స్థానాలను గెలుచుకుంది.
గతేడాది ఎన్సీపీలో అజిత్ పవార్ తిరుగుబాటుతో పార్టీ రెండు ముక్కలైంది. అయితే, ఎక్కువ మంది ఎమ్మెల్యేలు అజిత్ పవార్ వెనక ఉండటంతో ఆ పార్టీ గుర్తు ఆయనకే దక్కింది. దీంతో శరద్ పవార్ వేరే ఎన్సీపీ చిన్న వర్గానికి నాయకుడిగా మిగిలారు. పార్టీలో చీలిక అనంతరం అజిత్ పవార్ ఎన్డీయే కూటమితో చేరారు. మహారాష్ట్ర ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఒక్క ఎన్సీపీలోనే కాదు, బీజేపీలో కూడా ఇదే పరిస్థితి ఉంది. బీజేపీ కేవలం 09 ఎంపీ సీట్లను గెలుచుకోవడంతో, ఈ ఫలితాలపై ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తన పదవికి రాజీనామా చేయాలనే యోచనలో ఉన్నారు. పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వ పదవిని వీడాలనుకుంటున్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!