Sharad Pawar: ఈ ఏడాది చివర్లో అక్టోబర్-నవంబర్‌లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్డీయే కూటమి, ప్రతిపక్ష మహావికాస్ అఘాడి(ఏంవీఏ) సిద్ధం అవుతున్నాయి.
మహారాష్ట్రలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మహారాష్ట్ర పాలిటిక్స్‌ను తలకిందులు చేశాయి. దీంతో అజిత్ వర్గం ఎమ్మెల్యేల్లో అలజడి మొదలైంది.
Sharad Pawar: లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన (యూబీటీ)తో కలిసి పోరాడిన శరద్ పవార్ పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తన వైఖరిని ప్రదర్శించింది. పార్లమెంట్ ఎన్నికల్లో తక్కువ స్థానాల్లోనే పోటీ చేశాం.. కానీ, అసెంబ్లీలో మాత్రం మా పార్టీ రాజీపడదని శివసేన, కాంగ్రెస్ పార్టీలకు స్పష్టం చేశారు.
ఈరోజు నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో .. ఈ ఏడాది చివర్లో (మహారాష్ట్ర విధాన సభ ఎన్నికలు 2024) జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని తన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అధికారం మన చేతుల్లోకి వస్తుందని శరద్ పవార్ పేర్కొన్నారు.
NCP: మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి ఘోరపరాజయం ఆ కూటమిలోని పార్టీలకు ఇబ్బందికరంగా మారాయి.ముఖ్యంగా ఎన్సీపీలో లుకలుకలు బయటపడుతున్నాయి. అజిత్ పవార్ ఎన్సీపీ వర్గానికి చెందిన దాదాపు 10-15 మంది ఎమ్మెల్యేలు శరద్ పవార్ శిబిరంతో టచ్లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Sharad Pawar: రైతుల కష్టాలను ఉద్దేశిస్తూ ప్రధాని నరేంద్రమోడీ, ఎన్సీపీ నేత శరద్ పవార్‌పై విమర్శలు గుప్పించారు. ప్రధాని ఈ వ్యాఖ్యలు చేసిన ఒక రోజు తర్వాత శరద్ పవార్ ప్రధాని మోడీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ మహారాష్ట్రలో పర్యటించారు. ఈ సందర్భంగా శరద్ పవార్, ఉద్ధవ్ థాకరేలపై విరుచుకుపడ్డారు. ఆ రెండు పార్టీలు.. నకిలీ పార్టీలుగా అభివర్ణించారు.
Viral Video : శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేల వీడియో ఈ రోజుల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శరద్ పవార్ ఠాక్రేను గది నుంచి బయటకు వెళ్లమని అడుగుతున్నారని మహారాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.