ఎప్పుడు ఏదో ఓ రాజకీయ అంశంపై కీలక వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. మహారాష్ట్ర బివండీలో శనివారం ఓ సభలో ప్రసంగించారు. నిజానికి భారత దేశం ద్రవిడియన్లు, ఆదివాసీలది అని కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశం నాది కాదు, మోదీ- షాలది కాదు, ఠాక్రేలది కాదని.. ద్రవిడియన్లు, ఆదివాసీలది మాత్రమే అని ఆయన అన్నారుు. మొగల్స్ తరువాతే బీజేపీ ఆర్ఎస్ఎస్ ఉన్నాయని అసదుద్దీన్ అన్నారు. ఆఫ్రికా, మధ్య ఆసియా, ఇరాన్, తూర్పు ఆసియా నుంచి వలస వచ్చిన వారితో భారత్ ఏర్పడిందని కీలక వ్యాఖ్యలు చేవారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ పై కూడా ఓవైసీ నిప్పులు చెరిగారు. శివసేల ఎంపీ సంజయ్ రౌత్ కు చేసినట్లుగా నవాబ్ మాలిక్ అరెస్ట్ పై ప్రధాని మోదీని ఎందుకు కలవలేదని ప్రశ్నించారు. బీజేపీ, ఎన్సీపీ, కాంగ్రెస్, ఎస్పీ పార్టీలు లౌకిక పార్టీలు అని.. అయితే సంజయ్ రౌత్ పై కేంద్ర సంస్థలు ఎలాంటి చర్య తీసుకోకుండా శరద్ పవార్, ప్రధాని మోదీని కలిశారని.. ఇదే సమయంలో ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ అరెస్ట్ అయితే ఆయనకు ఎందుకు సాయం చేయలేదని.. ఆయన ముస్లిం కావడం వల్లేనా..? అని ప్రశ్నించారు. సంజయ్ రౌత్, నవాబ్ మాలిక్ కన్నా ఎక్కువా..? నవాబ్ మాలిక్ కు ఎందుకు సహాయం చేయలేదని ఎన్సీపీ కార్యకర్తలు శరద్ పవార్ ను అడగాలని ఓవైసీ డిమాండ్ చేశారు.
మహారాష్ట్ర ఎన్నికల ముందు ఎన్సీపీ, ఎంఐఎంకు ఓటు వేయాలని మాకు మద్దుతు ఇచ్చారని.. ఎన్నికల తరువాత శివసేనను పెళ్లి చేసుకున్నారని.. కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీలో పెళ్లికూతురు ఎవరో తెలియాలని సెటైర్లు వేశారు. కేంద్రం ద్రవ్యోల్బనం, నిరుద్యోగితపై మాట్లాడకుండా ముస్లింలను బూచిగా చూపిస్తుందని అన్నారు. మోదీ, అమిత్ షా, యోగీ, శరద్ పవార్ కు ఎవరైనా వ్యతిరేఖంగా మాట్లాడితే అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు.