కేంద్ర ప్రభుత్వం మరోసారి పెట్రోల్, డిజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దేశ ప్రజలకు పెరుగుతున్న పెట్రోల్, డిజిల్ ధరల నుంచి కాస్త ఉపశమనం కలిగించింది. ఇదిలా ఉంటే కేంద్ర నిర్ణయంపై విపక్షాలు స్పందిస్తున్నాయి. తాజాగా కేంద్ర నిర్ణయంపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ స్పందించారు. ‘ ఏం లేనిదాని కన్నా ఇది మంచిది’ అంటూ కామెంట్స్ చేశారు. కేంద్రం లీటర్ పెట్రోల్ పై రూ. 9.5, డిజిల్ పై రూ. 7 తగ్గించిన తర్వాత ఈ కామెంట్స్ చేశారు.
ఇదిలా ఉంటే జ్ఞానవాపి వివాదంపై కూడా ఆయన పలు కీలక కామెంట్లు చేశారు. దేశ ప్రజలను నిరుద్యోగం, ద్రవ్యోల్బనం, మతపరమైన ఉద్రిక్త పరిస్థితుల నుంచి చూపు మళ్లించేదుకు, ప్రాథమిక సమస్యలను పక్కదారి పట్టించేందుకు కుట్రగా శరద్ పవార్ అభివర్ణించారు.
మరోవైపు బీజేపీ జాతీయాధ్యక్షడు జేపీ నడ్డా కేంద్ర ప్రభత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న విపక్షాలు కూడా ప్రజలపై ద్రవ్యోల్భన ప్రభావం తగ్గించేందుకు వ్యాట్ తగ్గించుకోవాలని సూచించారు. ప్రజలకు ప్రత్యక్షంగా ఉపశమనం కల్పించిందందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి. ఇదిలా ఉంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రాలపై ఒత్తడి తెచ్చే బదులు కేంద్రమే మరింతగా పన్నులు తగ్గించ వచ్చని త్రుణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగతారాయ్ సూచించారు.