Ajit Pawar: మహరాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం.. డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్.. మంత్రులుగా 9 మంది ఎన్సీపీ నేతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajit Pawar:మహరాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) కీలక నేత అజిత్ పవార్ అసమ్మతి రగిలించారు. తాజాగా ఆయన బీజేపీ-శివసేన ప్రభుత్వంలో చేరారు. అజిత్ పవార్ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కు బిగ్ షాక్ ఇచ్చారు. గత కొంత కాలంగా ఆయన బీజేపీలో చేరుతారనే వార్తల నేపథ్యంలో ఈ రాజకీయ పరిణామం ఎదురైంది. తాజాగా అజిత్ పవార్ మరియు 9 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
Read Also: NCP Ajit Pawar : మహారాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు.. ఎన్సీపీ కాంగ్రెస్‌లో చీలిక
Also Read
అజిత్ పవార్, పలువురు ఎమ్మెల్యేల మద్దతుతో ఆదివారం మహారాష్ట్ర ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా చేరారు. ఆయన ఈ పోస్ట్‌ను బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌తో పంచుకోనున్నారు. మొత్తం 53 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేల్లో 30 మంది అజిత్ పవార్ వర్గంలో చేరిపోయారు. ఆదివారం రాజ్ భవన్ లో ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో గవర్నర్ అజిత్ పవార్‌తో పాటు ఛగన్ భుజ్‌బల్, ధనంజయ్ ముండే, దిలీప్ వాల్సే పాటిల్ సహా మొత్తం తొమ్మిది మంది ఎన్సీపీ నేతలు మంత్రులుగా ప్రమాణం చేయించారు.
అంతకుముందు ముంబైలోని తన అధికారిక నివాసంలో అజిత్ పవార్ కొందరు పార్టీ నేతలు, ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ భేటీ గురించి ఎన్సీపీ చీప్ శరద్ పవార్ కి తెలియదు. ‘‘ఈ సమావేశాన్ని ఎందుకు పిలిచారో నాకు సరిగ్గా తెలియదు కానీ, ప్రతిపక్ష నేతగా, ఎమ్మెల్యేల సమావేశాన్ని పిలిచే హక్కు ఆయనకు [అజిత్ పవార్‌కు] ఉంది. అతను క్రమం తప్పకుండా అలా చేస్తాడు. దీని గురించి నాకు పెద్దగా వివరాలు లేవు. సమావేశమయ్యారు’’ అని శరద్ పవార్ అన్నారు. అజిత్ పవార్ అధికారిక నివాసం ‘దేవగిరి’లో జరిగిన ఈ సమావేశానికి ఎన్‌సిపి సీనియర్ నేత ఛగన్ భుజ్‌బల్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే తదితరులు హాజరు కాగా, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జయంత్ పాటిల్ హాజరుకాలేదు.
#MaharashtraPolitics | NCP leader Ajit Pawar takes oath as Maharashtra Minister in the presence of CM Eknath Shinde and Deputy CM Devendra Fadnavis pic.twitter.com/F58i9WvtJ0
— ANI (@ANI) July 2, 2023
తాజావార్తలు
-
Varanasi Update: ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్.. ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్ వైరల్!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
BRICS Trade Boost: బ్రిక్స్ దేశాల్లో భారతీయ వస్తువులకు భారీ డిమాండ్.. 5 నెలల్లో ఎగుమతులు 34% జంప్
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
ట్రెండింగ్
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!