ఇండియాలోనే టాప్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ కాంబినేషన్ లో ఓ భారీ పాన్ ఇండియా మూవీని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. “ఆర్సి15” అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ విషయమై సినిమా అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి సస్పెన్స్ నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ను అధికారికంగా ప్రకటించారు. చరణ్ సరసన బాలీవుడ్ నటి కియారా అద్వానీని హీరోయిన్‌గా ఎంపిక చేశారు. “వినయ విధేయ రామ”…
మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ‘దిల్’ రాజు, శిరీశ్ నిర్మిస్తోన్న పాన్ ఇండియా మూవీకి మోస్ట్ హ్యపెనింగ్ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్. ఎస్. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. శంకర్ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండటం ఇదే తొలిసారి. శంకర్ రూపొందించిన ‘బాయ్స్’ సినిమాలో నటించిన తమన్, ఇప్పుడు ఆయన తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మూవీకి సంగీతం అందించడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు.…
‘కృష్ణం వందే జగద్గురుమ్’కు అద్భుతమైన సంభాషణలు రాసి అందరి దృష్టినీ తన వైపు తిప్పుకున్న బుర్రా సాయిమాధవ్ ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, కంచె, గోపాల గోపాల’ వంటి చిత్రాలకూ చక్కని సంభాషణలు రాసిన సాయిమాధవ్, నందమూరి బాలకృష్ణ ‘గౌతమీ పుత్ర శాతకర్ణి, ఎన్టీయార్ కథానాయకుడు, మహానాయకుడు’; చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150, సైరా’ చిత్రాలకూ మాటలు రాసి తాను స్టార్ హీరోలకూ రచన చేయగలనని నిరూపించుకున్నారు. ప్రస్తుతం ‘ట్రిపుల్…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో “ఆర్‌సి 15” అనే భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఉంటుందని ప్రకటించిన విషయం తెలిసిందే. కొన్నాళ్ల క్రితమే ఈ మేకర్స్ నుంచి ఈ ప్రకటన రాగా… అప్పుడే సినిమాపై అంచనాలు, ఆసక్తి పెరిగిపోయాయి. అయితే తాజాగా “ఆర్‌సి 15” టీం రామ్ చరణ్, శంకర్ లతో పాటు చిత్ర నిర్మాత దిల్ రాజు కూడా కలిసి ఉన్న పిక్ నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో “ఆర్‌సి 15” అనే పాన్ ఇండియా మూవీని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అంతకంటే ముందు కమల్ హాసన్ తో శంకర్ “ఇండియన్-2″ను తీయాల్సి ఉంది. కొన్ని కారణాలతో ఈ చిత్రం ఆగిపోగా… అది పూర్తయ్యేవరకూ శంకర్ మరే ఇతర చిత్రాలను తీయకూడదని “ఇండియన్-2” నిర్మాతలు కోర్టుకెక్కారు. దీంతో శంకర్ ప్రకటించిన ఇతర ప్రాజెక్టులపై సందేహాలు నెలకొన్నాయి. కానీ తాజా సమాచారం ప్రకారం… శంకర్, రామ్…
మెగా ఫ్యామిలీ యంగ్ స్టార్ హీరోలు పాన్ ఇండియా స్టార్స్ గా గుర్తింపు తెచ్చుకోవడానికి పకడ్బందీగా పావులు కదుపుతున్నారు. అంతేకాదు.. అవకాశం చిక్కాలే కానీ ఉత్తరాదిన పాగా వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే రామ్ చరణ్ హిందీ చిత్రం ‘జంజీర్’లో నటించాడు కానీ తనదైన మార్క్ వేసుకోలేకపోయాడు. దాంతో మెగా ఫ్యామిలీలోని మరో యంగ్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఆచితూచి ఉత్తరాది వైపు అడుగులు వేయాలనే నిర్ణయానికి వచ్చాడు. ఇదిలా ఉంటే రాజమౌళి…
తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్, టాలీవుడ్ హీరో రాంచరణ్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ పై క్లారిటీ వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి కావొస్తున్నాయని తెలుస్తోంది. జులై రెండో వారంలో పూజా కార్యక్రమాలు జరుపుకొని, ఆగష్టు మొదటి వారంలో రెగ్యులర్ షూటింగ్ జరగనున్నట్లు సమాచారం. మొదటి షెడ్యూల్ హైదరాబాద్ లోనే జరగనుందని.. దానికి సంబందించిన సెట్స్…
ప్రముఖ దర్శకుడు శంకర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో ఓ పాన్-ఇండియన్ చిత్రం రూపొందనుంది అన్న విషయం తెలిసిందే. శంకర్ సినిమాలు ఎంత భారీగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిన్న పాత్ర కోసం కూడా అతను ప్రసిద్ధ నటులను ఎన్నుకుంటాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం ఇంకా ప్రారంభం కాలేదు. కానీ సినిమాపై పలు రూమర్లు మాత్రం చక్కర్లు కొడుతున్నాయి. తాజా అప్డేట్ ప్రకారం ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం “ఆర్ఆర్ఆర్” అనే పాన్ ఇండియా చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి “ఆచార్య”లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆ తరువాత ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా మూవీలో నటించనున్నట్లు ప్రకటించారు. అయితే శంకర్ ముందుగా కమల్ హాసన్ తో “ఇండియన్-2” చిత్రాన్ని పూర్తి చేయాల్సి ఉంది.…
సెన్సేషన్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో సినిమా రానున్న విషయం తెలిసిందే. ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. రాజకీయ నేపథ్యంలో రామ్ చరణ్- శంకర్ సినిమా ఉంటుందని ప్రచారం నడుస్తుంది. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈ సినిమాపై పలు రూమర్లు చక్కర్లు కొడుతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం నాలుగు భాషల…