ప్రముఖ దర్శకుడు శంకర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో ఓ పాన్-ఇండియన్ చిత్రం రూపొందనుంది అన్న విషయం తెలిసిందే. శంకర్ సినిమాలు ఎంత భారీగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిన్న పాత్ర కోసం కూడా అతను ప్రసిద్ధ నటులను ఎన్నుకుంటాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం ఇంకా ప్రారంభం కాలేదు. కానీ సినిమాపై పలు రూమర్లు మాత్రం చక్కర్లు కొడుతున్నాయి. తాజా అప్డేట్ ప్రకారం ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నారట. ఈ చిత్రంలో మలయాళ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటించే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే మాళవిక సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కలిసి ‘పేటా’ చిత్రం, తలపతి విజయ్ తో ‘మాస్టర్’లో స్క్రీన్ స్పేస్ పంచుకున్నారు. విజయ్ దేవరకొండతో కలిసి ఆమె తెలుగు అరంగేట్రం చేయాల్సి ఉంది. కాని ఈ ప్రాజెక్ట్ నిలిపివేయబడింది. మరిప్పుడు ఈ బ్యూటీ “ఆర్‌సి 15″లో కన్పిస్తుందో లేదో చూడాలి.