మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం “ఆర్ఆర్ఆర్” అనే పాన్ ఇండియా చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి “ఆచార్య”లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆ తరువాత ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా మూవీలో నటించనున్నట్లు ప్రకటించారు. అయితే శంకర్ ముందుగా కమల్ హాసన్ తో “ఇండియన్-2” చిత్రాన్ని పూర్తి చేయాల్సి ఉంది. ఆ తరువాతే రామ్ చరణ్ ప్రాజెక్ట్ పై దృష్టి పెడతారు. అయితే “ఇండియన్-2″ పూర్తయ్యే లోపు చరణ్”ఆర్ఆర్ఆర్”, “ఆచార్య” చిత్రాల షూటింగ్ ను పూర్తి చేసేస్తాడు. కానీ ఆ తరువాత చాలా సమయం ఖాళీగా ఉండాల్సి వస్తుంది. దీంతో శంకర్ “ఇండియన్-2” పూర్తి చేసేలోపు మరో చిత్రాన్ని చేయాలనే ఆలోచనలో ఉన్నాడట చరణ్. తాజా సమాచారం ప్రకారం కొంతమంది యంగ్ డైరెక్టర్స్ ను కథలు వినిపించడానికి ఆహ్వానించాడట చరణ్. అయితే చరణ్ ను మెప్పించాలంటే ఇప్పుడు డైరెక్టర్స్ చెప్పాల్సింది సాదాసీదా కథలు కాదు. ఎందుకంటే “ఆర్ఆర్ఆర్”తో చరణ్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. మరి దర్శకులు కూడా ఆ రేంజ్ లో కథలను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే గనుక నిజమైతే చరణ్ యంగ్ డైరెక్టర్స్ కు అవకాశాల గేట్లు తెరిచినట్టే. ఒకవేళ శంకర్ తో తన చిత్రం ఆలస్యమయ్యే అవకాశం ఉంటే వెంటనే ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభిస్తారు చరణ్. మరి ఆ అవకాశం ఏ దర్శకుడికి దక్కుతుందో చూడాలి.