అటు చెర్రీ తో శంకర్… ఇటు బన్నీతో మురుగదాస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా ఫ్యామిలీ యంగ్ స్టార్ హీరోలు పాన్ ఇండియా స్టార్స్ గా గుర్తింపు తెచ్చుకోవడానికి పకడ్బందీగా పావులు కదుపుతున్నారు. అంతేకాదు.. అవకాశం చిక్కాలే కానీ ఉత్తరాదిన పాగా వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే రామ్ చరణ్ హిందీ చిత్రం ‘జంజీర్’లో నటించాడు కానీ తనదైన మార్క్ వేసుకోలేకపోయాడు. దాంతో మెగా ఫ్యామిలీలోని మరో యంగ్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఆచితూచి ఉత్తరాది వైపు అడుగులు వేయాలనే నిర్ణయానికి వచ్చాడు.
ఇదిలా ఉంటే రాజమౌళి ‘ట్రిపుల్ ఆర్’తో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకోవడానికి రామ్ చరణ్ ప్రయత్నిస్తున్నాడు. ఇదే సమయంలో ఇటు అల్లు అర్జున్ సైతం సుకుమార్ డైరెక్షన్ లో చేస్తున్న ‘పుష్ప’తో అలాంటి గుర్తింపునే పొందబోతున్నాడు. ఇది రెండు భాగాలుగా వస్తుండటం మరో విశేషం. ఇదిలా ఉంటే ‘ట్రిపుల్ ఆర్’ తర్వాత తన రేంజ్ తగ్గకుండా చూసుకోవాలని రామ్ చరణ్ ఏకంగా క్రేజీ డైరెక్టర్ శంకర్ తోనే చేతులు కలిపాడు. అన్నీ సక్రమంగా జరిగి ఉంటే… ఈ సినిమా నిర్మాత ‘దిల్’ రాజు ఈ పాటికే సెట్స్ పైకి తీసుకెళ్ళే వాడు. కాస్త అటు ఇటు అయినా… త్వరలో ఈ మూవీ పట్టాలెక్కడమైతే ఖాయం. అదే సమయంలో అల్లు అర్జున్ సైతం ‘వకీల్ సాబ్’ ఫేమ్ వేణు శ్రీరామ్ తో ‘ఐకాన్’ చేయబోతున్నాడు. దీని తర్వాత కూడా మరో పాన్ ఇండియా మూవీకి బన్నీ ఇప్పటి నుండే పథక రచన చేస్తున్నాడని తెలుస్తోంది.
Also Read
- Tharun - Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ - ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
- Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
- Bollywood : సూపర్ హీరో కథలపై బాలీవుడ్ స్టార్ హీరోస్ మోజు
- Movies Without Trailers: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి వచ్చిన సినిమాలు ఇవే.. లిస్ట్‌లో నాని కొత్త సినిమా!
Read Also : ముందు సీతావతారం… తరువాత ద్రౌపదిగా దీపిక!
ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు మురుగదాస్ తో అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడట. దానికి సంబంధించిన వర్క్ సైతం సైలెంట్ గా జరుగుతోందని అంటున్నారు. ఇటీవలే అల్లు అరవింద్, అర్జున్ కు మురుగదాస్ స్క్రిప్ట్ వినిపించాడన్నది తాజా సమాచారం. ఒక్కసారి ఈ తండ్రీ కొడుకుల నుండి గ్రీన్ సిగ్నల్ వస్తే… మురుగదాస్ ఆ ప్రాజెక్ట్ పనిలో పడిపోతాడని అంటున్నారు. విశేషం ఏమంటే… అల్లు అరవింద్, మురుగదాస్ మధ్య అనుబంధం ఈవాల్టిది కాదు. గతంలో తమిళ ‘గజిని’ సినిమాను అల్లు అరవింద్ తెలుగులో డబ్ చేయడంతో పాటు, హిందీలోనూ రీమేక్ చేశారు. ఆ అనుబంధంతోనే అర్జున్ హీరోగా అల్లు అరవింద్ పాన్ ఇండియా మూవీ నిర్మిస్తాడని, దీనికి ప్రముఖ తమిళ నిర్మాత కలైపులి ధాను సైతం సహ నిర్మాతగా వ్యవహరిస్తారని వార్తలు వస్తున్నాయి.
నిజానికి ఇటు చెర్రీ, అటు బన్నీ వరుస పాన్ ఇండియా మూవీస్ వెనుక ఒకరితో ఒకరు పోటీ పడుతున్న దాఖలాలూ కనిపిస్తున్నాయని కొందరంటున్నారు. మెగా ఫ్యామిలీలోని ఈ ఇద్దరు న్యూ జనరేషన్ స్టార్ హీరోల మధ్య కనిపించని పోటీ ఒకటి నెలకొందని, అందుకనే ఒకరిపై ఒకరు పై చేయి సాధించాలనే ఇలా పోటాపోటీగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
- Tags
- Allu Arjun
- Ram Charan
- Shankar
తాజావార్తలు
-
Tharun – Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
-
CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
-
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్‌లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్‌కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!