చెర్రీ – శంకర్ మూవీకి బుర్రా సాయిమాధవ్ డైలాగ్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘కృష్ణం వందే జగద్గురుమ్’కు అద్భుతమైన సంభాషణలు రాసి అందరి దృష్టినీ తన వైపు తిప్పుకున్న బుర్రా సాయిమాధవ్ ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, కంచె, గోపాల గోపాల’ వంటి చిత్రాలకూ చక్కని సంభాషణలు రాసిన సాయిమాధవ్, నందమూరి బాలకృష్ణ ‘గౌతమీ పుత్ర శాతకర్ణి, ఎన్టీయార్ కథానాయకుడు, మహానాయకుడు’; చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150, సైరా’ చిత్రాలకూ మాటలు రాసి తాను స్టార్ హీరోలకూ రచన చేయగలనని నిరూపించుకున్నారు. ప్రస్తుతం ‘ట్రిపుల్ ఆర్, శాకుంతలం, ప్రభాస్ – నాగఅశ్విన్’ చిత్రాలకు బుర్రా సాయిమాధవ్ సంభాషణలు రాస్తున్నారు.
Read Also : ఆర్య ఎపిక్ మూవీ “సర్పట్ట” ట్రైలర్
Also Read
విశేషం ఏమంటే… రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమాకూ ఆయనే సంభాషణలు రాస్తున్నారు. ఇటీవల చెన్నయ్ వెళ్ళి శంకర్ ను స్వయంగా కలిశారు బుర్రా సాయిమాధవ్. ” ‘జెంటిల్ మేన్’ సినిమా చూసినప్పుడు శంకర్ గారితో ఓ ఫోటో దిగితే ఈ జీవితానికి చాలనుకున్నాను. ఇప్పుడాయన సినిమాకి మాటలు రాస్తున్నాను” అంటూ సోషల్ మీడియా ద్వారా తన హర్షాన్ని వ్యక్తం చేశారు. అందుకు కారకులైన దిల్ రాజు, చరణ్ కు కృతజ్ఞతలు తెలిపారు బుర్రా సాయిమాధవ్. ‘ఇండియన్ -2’కు సంబంధించిన అడ్డంకులన్నీ తొలగిపోవడంతో ఇప్పుడు శంకర్ – రామ్ చరణ్ మూవీకి మార్గం సుగమం అయ్యింది. అతి త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే ఛాన్స్ ఉంది.
తాజావార్తలు
-
Dhee 10 Raju Arrested: లైంగిక వేధింపులు.. ఢీ రాజు అరెస్ట్!
-
Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
-
Debt Trap: అప్పు మీద అప్పు! దాచుకునేది తక్కువ..లోన్లు ఎక్కువ…ఇదే భారతీయుల దుస్థితి!
-
Shah Rukh Khan: సౌత్ దర్శకులే కావాలంటున్న షారుఖ్.. నెక్స్ట్ సినిమాలపై భారీ స్కెచ్!
-
Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్‌లైన్.. భారత్‌కు పెరిగిన కష్టాలు!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!