సినిమా కష్టాలు అంటే ఏమిటో సినిమా వాళ్లకే బాగా అనుభవంలోకి వస్తాయి. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ అదే పరిస్థితిలో ఉన్నారు. పైకి గంభీరంగా ఆయన కనిపిస్తున్నా, లోలోపల ఏ సినిమా ఎప్పుడు ఎలా పూర్తి చేయాలో తెలియక సతమతమౌతున్నారని తెలుస్తోంది. మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శంకర్… నిజంగా ఇన్ని వివాదాల్లో ఒకేసారి కూరుకుపోతారని కోలీవుడ్ లో ఎవరూ ఊహించలేదట. ఆయన దర్శకత్వంలో నటించడానికి స్టార్ హీరోలు సిద్ధంగా ఉన్నారు, అలానే కోట్లు…
‘ఇండియన్2’ వివాదం మరింత ముదురుతోంది. ఇటీవల శంకర్ మద్రాస్ హై కోర్టులో ‘ఇండియన్ 2’ సినిమా ఇంత ఆలస్యం కావటానికి నిర్మాణ సంస్థ లైకాతో పాటు హీరో కమల్ హాసన్ కారణం అంటూ కౌంటర్ పిటీషన్ దాఖలు చేశాడు. అయితే దీనికి లైకా అనుకోని రీతిలో స్పందించింది. శంకర్ ప్రస్తుతం తెలుగులో, బాలీవుడ్ లో సినిమాలు కమిట్ అయి ఉన్నాడు. అందుకే తెలుగు ఛాంబర్ కి, బాలీవుడ్ ఫిలిమ్ ఛాంబర్ కు లైకా శంకర్ మీద ఫిర్యాదు…
స్టార్ దర్శకుడు శంకర్ సినిమాల్లో ఇంతవరకు చూడని ఎన్నో వివాదాలు ‘ఇండియన్ 2’ చిత్రాన్ని చుట్టుముడుతున్నాయి. రెండున్నర దశాబ్దాల క్రితం వచ్చిన సంచలన చిత్రం ‘ఇండియన్’ కు ఇప్పుడు దర్శకుడు శంకర్ సీక్వెల్ రూపొందిస్తున్న సంగతి విదితమే. కమలహాసన్, కాజల్ జంటగా ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ భారీ బడ్జెట్టుతో నిర్మిస్తోంది. ఇప్పటికే కొంత చిత్రీకరణ కూడా జరిగింది. ఆ తరువాత వరుస వివాదాలతో ఈ సినిమా ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఈ సినిమా చిత్రీకరణను…
సెన్సేషన్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో సినిమా రానున్న విషయం తెలిసిందే. ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘ఆర్‌సి 15’ ఈ ఏడాది చివరి నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ ప్రాజెక్ట్ ను ప్రకటించినప్పటి నుంచి సినిమాకు సంబంధించిన పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా వచ్చిన క్రేజీ అప్డేట్ ఏంటంటే… ‘ఆర్‌సి 15’ కోసం శంకర్ ప్రముఖ లిరిసిస్ట్ వివేక్ ను తీసుకుంటున్నారట. ఇంకా…
ఇండియన్ ఐకానిక్ డైరెక్టర్ శంకర్ ‘అపరిచితుడు’ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది. బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్వీర్ సింగ్ ‘అపరిచితుడు’ రీమేక్ లో హీరోగా నటించనున్నారు. పెన్ మూవీస్ బ్యానర్ పై జయంతిలాల్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా నిర్మించనున్నారు. తమిళంలో ‘అన్నియన్’గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో ‘అపరిచితుడు’ పేరుతో విడుదలైంది. 2005లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సృష్టించిన సునామీ అంతా…