పాకిస్థాన్‌లో అసిమ్ మునీర్‌కు మళ్లీ ప్రమోషన్ దక్కింది. ఆర్మీ చీఫ్‌గా ఉన్న అతడు ఫీల్డ్ మార్షల్ ప్రమోషన్ పొందాడు. తాజాగా రక్షణ దళాల అధిపతిగా అసిమ్ మునీర్ ప్రమోషన్ పొందాడు. దేశ తొలి రక్షణ దళాల అధిపతి (CDF)గా ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ నియామకానికి పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఆమోదం తెలిపారు.
జైలులో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జైలు లోపల తనకు ఏదైనా జరిగితే, దానికి ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ బాధ్యత వహిస్తారని ఆయన అన్నారు. ఖాన్‌ను విడుదల చేయాలని షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం, సైనిక వ్యవస్థపై ఒత్తిడి తెచ్చేందుకు ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) ఆగస్టు 5 నుంచి దేశవ్యాప్తంగా భారీ నిరసనను చేపట్టబోతోంది. Also Read:Off The Record: ఆదాల పార్టీ…
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధంలోకి అమెరికా ప్రవేశించడం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను పెంచింది. కాగా గత కొన్ని రోజులుగా పాకిస్తాన్ అమెరికాను ప్రశంసించడంలో మునిగిపోయింది. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వైట్ హౌస్‌లో విందు చేశారు. ట్రంప్‌ను సంతోషపెట్టడానికి, మునీర్ తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని అభ్యర్థించారు. నిన్న, పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ కూడా దీనికి మద్దతు ఇచ్చారు. Also Read:Reza Shah Pahlavi: ఖమేనీ రాజీనామా…
ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలలో యుద్ధాలను ఆపడంలో తాను ముఖ్యమైన పాత్ర పోషించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇంతలో, పాకిస్తాన్ ప్రభుత్వం 2026 నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ పేరును అధికారికంగా ప్రతిపాదించింది. 2025లో భారతదేశం, పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధ సమయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాత్మక దౌత్య జోక్యం, మధ్యవర్తిత్వం కారణంగా ఆయన పేరును నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదించాలని నిర్ణయించినట్లు పాకిస్తాన్ ఒక ప్రకటనలో తెలిపింది. Also Read:DSP : మళ్లీ ఫాంలోకి…
Pakistan: పాకిస్తాన్ ఓ వైపు ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ, ఆ దేశం సైన్యానికి మాత్రం బాగా ఖర్చు చేస్తోంది. ప్రజల గురించి ఆలోచించడం మానేసి, భారత వ్యతిరేకతతోనే బతుకుతోంది. దేశాన్ని ఆర్థిక గండం నుంచి బయటపడేసేందుకు ప్రధాని నేతృత్వంలోని షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంకుల ముందు సాగిలపడుతోంది. ఇదే కాకుండా, పాకిస్తాన్ మిత్రదేశాల పర్యటనలకు వెళ్లి ‘‘భిక్షం’’ అడుగుతోంది.
పహల్గామ్ ఉగ్రవాద దాడికి పాకిస్థాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఆపరేషన్ సిందూర్ పేరిట భారత్ పాకిస్థాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. మన దేశం సాధించిన ఈ విజయంతో పాకిస్థాన్ నేతలు చిరాకుపడి.. తామే గెలిచామంటూ తమ డబ్బు తామే కొట్టుకుంది. తాజాగా ఉద్రిక్తత పరిస్థితుల అనంతరం భారత్‌ను కాపీ కొట్టడంలో పాకిస్థాన్ బిజీగా మారింది. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు సామేత ప్రస్తుతం పాకిస్థాన్‌కి బాగా అబ్బుతుంది.
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతను తగ్గించడానికి అమెరికా ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌లతో ఫోన్‌లో మాట్లాడారు. ఇరు దేశాలు ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని అమెరికా విదేశాంగ కార్యదర్శి కోరారు. షాబాజ్, జైశంకర్‌లతో విడివిడిగా చర్చలు జరిపిన తర్వాత అమెరికా విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. Also Read:Thopudurthi Prakash…
జైలు శిక్ష అనుభవిస్తున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాజకీయ ఇన్నింగ్స్ ముగింపు దశకు చేరుకుంది. తన పార్టీ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఆరోపించింది.
పాకిస్థాన్ లో క్షీణిస్తున్న దేశ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి అక్కడి షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నప్పటికీ, అవి ఎటువంటి గణనీయమైన ప్రభావాన్ని చూపడం లేదు. పాకిస్థాన్ ఇప్పటికే ప్రపంచ దేశాల నుంచి బిలియన్ల రూపాయల రుణం తీసుకుంది.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై ప్రజల ఆగ్రహం తారాస్థాయికి చేరుకుంది. అక్కడ హింసాత్మక నిరసనలకు పాకిస్థాన్ ప్రభుత్వం మోకరిల్లింది.