పాకిస్థాన్ లో క్షీణిస్తున్న దేశ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి అక్కడి షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నప్పటికీ, అవి ఎటువంటి గణనీయమైన ప్రభావాన్ని చూపడం లేదు. పాకిస్థాన్ ఇప్పటికే ప్రపంచ దేశాల నుంచి బిలియన్ల రూపాయల రుణం తీసుకుంది. బిజినెస్ టుడే నివేదిక ప్రకారం.. పాకిస్థాన్‌కు 124.5 బిలియన్ డాలర్ల విదేశీ రుణం ఉంది. ఇది దాని జిడిపిలో 42 శాతం. ఇప్పుడు పాక్ ప్రభుత్వం అన్ని ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నట్లు ప్రకటించింది. ఆర్థిక మాంద్యం చుట్టుముట్టిన పాకిస్థాన్‌లో గత ఏడాది నుంచి పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. ఎన్నికల తరువాత, దేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. మరోసారి షెహబాజ్ షరీఫ్ ప్రధాన మంత్రిగా దేశానికి నాయకత్వం వహించాడు. కాని రెండవ ఇన్నింగ్స్‌లో కూడా..పాకిస్థాన్ ను పేదరికం నుంచి బయటపడేసే సవాళ్లు అలాగే ఉన్నాయి. అయితే తాజాగా పాక్ పీఎం వేస్తున్న అడుగులు వార్తల్లో నిలిచాయి. వాస్తవానికి కొన్ని ప్రభుత్వ సంస్థలను మినహాయించి అన్ని ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఇది మొదటిసారి కాదు. కానీ తన మొదటి ప్రభుత్వంలో కూడా షాబాజ్ షరీఫ్ విమానాశ్రయం, ఓడరేవు, చారిత్రక హోటల్‌కు సంబంధించి ఇటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది.
READ MORE: Sexual Harassment: తనిఖీల పేరుతో వేధింపులు.. కామారెడ్డి డీఎంహెచ్‌వో, సూపరింటెండెంట్ అరెస్ట్..
పొరుగు దేశం పాకిస్థాన్ ఏ మేరకు అప్పుల ఊబిలో కూరుకుపోయిందో, ఇప్పటి వరకు ఏయే విషయాలను ప్రయివేటు చేతులకు అప్పగించిందో తెలుసుకుందాం. చాలా కాలంగా ద్రవ్యోల్బణంతో బాధపడుతున్న దేశ ప్రజలకు ఉపశమనం కలిగించడానికి పాకిస్థాన్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. అటువంటి పరిస్థితిలో, పేదరికాన్ని అధిగమించడానికి, షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం నిరంతరం కొత్త, ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పుడు ప్రధాన మంత్రి (PM షెహబాజ్ షరీఫ్) గత మంగళవారం వ్యూహాత్మకంగా ముఖ్యమైన సంస్థలు మినహా అన్ని ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలను ప్రైవేటీకరించినట్లు ప్రకటించారు. ARY న్యూస్ నివేదిక ప్రకారం, దీనికి సంబంధించి జరిగిన సమావేశంలో, ప్రైవేటీకరణ కార్యక్రమం 2024-29 యొక్క రోడ్‌మ్యాప్‌ను ప్రదర్శించారు. ఇందులో విద్యుత్ పంపిణీ సంస్థల ప్రైవేటీకరణ కూడా ఉంది. నివేదిక ప్రకారం, పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ కంపెనీ లిమిటెడ్ (PIA) ప్రైవేటీకరణతో ప్రభుత్వం ప్రభుత్వ కంపెనీలను విక్రయించడం ప్రారంభిస్తుంది.