Imran Khan Calls For Fresh Polls In Pakistan: పాకిస్తాన్ తో రాజకీయ సంక్షోభం ముదురుతోంది. ప్రధాని పదవి నుంచి ఇమ్రాన్ ఖాన్ దిగిపోయి.. షహజాబ్ షరీఫ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి అక్కడ రాజకీయ సంక్షోభం మొదలైంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తున్నారు. ఆజాదీ మార్చ్ పేరుతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాడు.
దాయాది దేశం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతోంది. దేశంలోని విదేశీ మారక నిల్వలు అడుగంటిపోయాయి. దీంతో పాటు విపరీతమైన అప్పుల కారణంగా పాకిస్తాన్, మరో శ్రీలంకగా మారబోతోంది. శ్రీలంక పరిస్థితి రావడం ఖాయం కానీ.. ఎన్ని రోజుల్లో అనేదే తేలాలి. పాకిస్తాన్ ఈ ఆర్థిక సంక్షోభం నుంచి కోలుకోవడానికి ఐఎంఎఫ్ సాయం కోరుతోంది. ఇదిలా ఉంటే పాకిస్తాన్ లో విద్యుత్ సంక్షోభం నెలకొంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా తీవ్రమైన విద్యుత్ కోతలు నెలకొన్నాయి. విద్యుత్ ఉత్పత్తి…
పాకిస్తాన్ దేశంలో ఆర్థిక సంక్షోభం తారాస్థాయికి చేరింది. ఎంతలా అంటే అక్కడ మంత్రులు టీ తాగడాన్ని తగ్గించండి అనే స్థాయికి దిగజారింది. ఇతర దేశాల నుంచి ‘టీ’ దిగుమతి చేసుకునేందుకు కూడా విదేశీ మారక నిల్వలు లేని పరిస్థితి. ఇక ఇంధన సమస్యతో విద్యుత్ వినియోగాన్ని తక్కువ చేయడానికి సాయంత్రం వరకే షాపులు, మార్కెట్లు తెరవాలని రాత్రి 10 తరువాత పెళ్లి వేడులకు జరపకూడదని ఆదేశాలు ఇస్తోంది అక్కడి సర్కార్. ఇదిలా ఉంటే ప్రస్తుతం అక్కడ ప్రధానులు,…
మరో ఆసియా దేశం ఆర్థిక కష్టాల్లో కూరుకుపోతోంది. ఇప్పటికే శ్రీలంక దారిలోనే దాయాది దేశం పాకిస్తాన్ పయణిస్తోంది. తాజాగా ఆ దేశంలో కరెంట్ ఇబ్బందులు తారాస్థాయికి చేరాయి. ఎంతలా విద్యుత్ ఆదా చేసేందుకు పెళ్లి వేడులకు కూడా కరెంట్ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. తాజాగా పాక్ రాజధాని ఇస్లామాబాద్ లో రాత్రి 10 గంటల తర్వాత వివాహ వేడుకలను నిషేధించారు. ప్రస్తుతం పాకిస్తాన్ లో విద్యుత్ సంక్షోభం భారీగా ఉంది. జూన్ 8 నుంచి ఈ నిషేధం…
ప్రభుత్వాాలు మారిన పాకిస్తాన్ భారత్ పై విషం చిమ్మడం మానదు. తన దేశాన్ని వెలగబెట్టలేదు కానీ అవకాశం వచ్చినప్పుడు కాశ్మీర్ ను రాజకీయం చేయాలని భావిస్తూనే ఉంది. ఇప్పటికే ఆర్థిక సమస్యలు, రాజకీయ సమస్యలతో సతమతం అవుతున్న పాకిస్తాన్, భారత్ కు నీతులు చెప్పడం విడ్డూరం. తన దేశంలో మైనారిటీలపై అఘాయిత్యాలు, హింస గురించి మాట్లాడదు కానీ కాశ్మీరి ప్రజల హక్కులను గురించి ప్రశ్నిస్తూ ఉంటుంది. తాజాగా కొత్తగా ఎన్నికైన ప్రధాని షహబాజ్ షరీఫ్ మళ్లీ పాత…
పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉంది. దీనికి కారణం గత ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అని ప్రస్తుత ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆయన పార్టీ ఆరోపిస్తోంది. దేశంలో ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టేందుకు ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రయత్నిస్తున్నాడు. దీంట్లో భాగంగానే కీలక నిర్ణయం తీసుకున్నాడు. దేశంలో తీవ్ర నగదు కొరత ఉంది. ఆర్థిక మాంద్యం పరిస్థితులను నివారించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది. దీంట్లో భాగంగానే విదేశాల…
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుత ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్ తో పాటు ఆయన ప్రభుత్వాన్ని దోపిడీ ప్రభుత్వంగా అభివర్ణిస్తున్నారు. తాజాగా ఆయన మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ను దొంగల చేతిలో పెట్టడం కన్నా అణుబాంబు వేయడం మంచిదంటూ వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రిక్-ఇ- ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. షహబాజ్ షరీఫ్, ఆయన పార్టీ…
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం అంశంపై గత కొంతకాలంగా చర్చ సాగుతోంది.. ఈ మధ్య ఆయన చేసిన వ్యాఖ్యలు గమనించినా.. ఇమ్రాన్ ఖాన్ పదవి ఊడిపోవడం ఖాయమనే సంకేతాలు వెలువడ్డాయి.. అయితే, ఇవాళ పాక్ పార్లమెంట్‌లో ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దిగువ సభలో ప్రతిపక్ష నేత, పీఎంఎల్ నవాజ్ పార్టీ అధ్యక్షుడు షాబాజ్ ఫరీఫ్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇక, ఆ అవిశ్వాన తీర్మానాన్ని చర్చకు స్వీకరిస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ ఖాసిమ్…