JNUSU: జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం (JNUSU) ఎన్నికల్లో ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA), స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI), మరియు డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఫ్రంట్ (DSF) ల సంకీర్ణమైన లెఫ్ట్ యూనిటీ అలయన్స్ అఖండ విజయం సాధించింది. నాలుగు సెంట్రల్ ప్యానెల్ పదవుల్ని కైవసం చేసుకుంది. క్యాంపస్‌లో పూర్తి ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది.
HCU: ఢిల్లీ యూనివర్సిటీ తర్వాత, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల్లో బీజేపీ విద్యార్థి సంఘం అయిన ‘‘అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ABVP)’’ జయకేతనం ఎగరేసింది. ఏబీవీపీ-ఎస్ఎల్వీడీ కూటమి అన్ని సెంట్రల్ ప్యానెల్ పోస్టుల్ని కైవసం చేసుకుంది. కూటమికి చెందిన శివ పాలెపు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఏబీవీపీ కూటమికి చెందిన శ్రుతి ప్రియ ప్రధాన కార్యదర్శి, సౌరభ్ శుక్లా సంయుక్త కార్యదర్శి పదవుల్ని గెలుచుకున్నారు.
Student Unions: విద్యార్థులకు పెద్ద శుభవార్త. నీట్, నెట్ పరీక్షల లీకేజీపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతూ జులై 4న దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల బంద్‌కు SIF, AISF, PDSU, PDSO, NSUI విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి.
Kerala: కేరళలో వెటర్నరీ విద్యార్థి మరణం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. వయనాడ్‌లోని వెటర్నరీ యూనివర్సిటీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న జేఎస్ సిద్ధార్థ్ ఫిబ్రవరి 18న కాలేజీ హాస్టల్‌లో ఉరేసుకుని మరణించాడు. అయితే, ఇది ఆత్మహత్య కాదని హత్య అని బాధితుడి కుటుంబం ఆరోపిస్తుంది. ఈ కేసులో కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ వర్సిటీ వైస్‌ఛాన్సలర్‌ని శనివారం సస్పెండ్ చేశారు. ఈ కేసులో పోలసీులు 11 మందిని అరెస్ట్ చేశారు. సిద్ధార్థ్ మరణించడానికి ముందు ర్యాగింగ్ చేసి…
Sangareddy: సంగారెడ్డిలో అర్ధరాత్రి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. SFI, ABVP విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. నేడు SFI రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు ఉండటంతో SFI కార్యకర్తలు జెండాలు కడుతున్నారు.
Periyar, Karl Marx photos ‘vandalised’ at JNU: ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జెఎన్‌యూ)లో మరోసారి ఉద్రిక్తత ఏర్పడింది. బీజేపీ అనుబంధం విద్యార్థి విభాగం (ఏబీవీపీ) పెరియార్, భగత్ సింగ్, బాబా సాహెబ్ అంబేద్కర్, కార్ల్ మార్క్స్, జ్యోతిబా, సావిత్రీబాయి ఫూలే మొదలైన వారి ఫోటోలను ధ్వంసం చేశారని వామపక్ష విద్యార్థి విభాగం(ఎస్ఎఫ్ఐ), జెఎన్‌యూ విద్యార్థి సంఘం సోమవారం ఆరోపించింది.
కేరళలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి విభాగం అల్లర్లకు కారణం అయ్యారు. ఏకంగా కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ కార్యాలయాన్ని శుక్రవారం ధ్వసం చేశారు. కేరళలోని కొండ ప్రాంతాల్లోని అడవుల చుట్టూ బఫర్ జోన్ల వల్ల కలిగే ఇబ్బందులపై రాహుల్ గాంధీ జోక్యం చేసుకోవడంలో విఫలం అయ్యారని ఆరోపిస్తూ తీవ్ర ఆందోళనలకు తెరతీసింది వామపక్ష విద్యార్థి విభాగం ఎస్ఎఫ్ఐ. ఆందోళనల్లో భాగంగా వయనాడ్ లోని రాహుల్ గాంధీ ఆఫీస్ పై పెద్ద ఎత్తున దాడికి పాల్పడ్డారు. దాడికి…
తెలంగాణలో కేసీఆర్ ఉద్యోగాల ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 91,142 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. వాటిలో 80,039 ఉద్యోగాలకు నేడే నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. మిగిలిన 11,103 ఒప్పంద ఉద్యోగులకు క్రమబద్దీకరిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో 91,142 ఉద్యోగాలతోనే నిరుద్యోగ నిర్మూలన సాధ్యంకాదు. ఒకేసారి ఖాళీలన్నింటిని భర్తీ చేయాలని ఎస్.ఎఫ్.ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. తక్షణమే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులకు ఒకేసారి నోటిఫికేషన్ ఇవ్వాలని ఎస్.ఎఫ్.ఐ. డిమాండ్ చేసింది. రాష్ట్ర…