Sangareddy: సంగారెడ్డిలో అర్ధరాత్రి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. SFI, ABVP విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. నేడు SFI రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు ఉండటంతో SFI కార్యకర్తలు జెండాలు కడుతున్నారు. అయితే ఒక్కసారిగా ABVP కార్యకర్తలు అక్కడకు వచ్చారు. SFI నాయకులపై ఒక్కసారిగా దాడి చేసారు. SFI నాయకులకు ఏం జరుగుతుందో అసలు అర్థం కాలేదు. ABVP కార్యకర్తలు ఎందుకు దాడి చేస్తున్నారో ప్రశ్నార్థంగా మారింది. ఎందుకు దాడి చేస్తున్నారు అని అడుగుతున్న సంగారెడ్డి SFI జిల్లా కార్యదర్శి రమేష్ తలపై ABVP కార్యకర్తలు బలంగా దాడి చేసారు. దీంతో రమేష్ కు తీవ్ర రక్తస్రావంతో స్పృహ తప్పి పడిపోయాడు. రమేష్ ని సంగారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించారు.
Read also: TS TRT : 5,089 పోస్టులకు టీఆర్టీ నోటిఫికేషన్ విడుదల..
భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర సర్వసభ్య సమావేశం నేటి నుంచి ఆదివారం వరకు సంగారెడ్డిలో జరగనుంది. విద్యారంగం, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి భవిష్యత్ పోరాటాలకు రూపకల్పన చేస్తామని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎల్.మూర్తి, కార్యదర్శి టి.నాగరాజు అన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో విద్యారంగం సంక్షోభంలో కూరుకుపోయిందని విమర్శించారు. ప్రభుత్వ విద్యారంగం సమస్యల వలయంలో చిక్కుకుందని అన్నారు. పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీల వరకు అభివృద్ధి లేదన్నారు. పాఠశాలల్లో 24 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 5,089 పోస్టులను భర్తీ చేయడం సరికాదన్నారు. యూనివర్సిటీల్లో 5,552 టీచింగ్ పోస్టులు, నాన్ టీచింగ్ స్టాఫ్ ఖాళీలు ఉన్నాయని వివరించారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు పూర్తి స్థాయిలో అందడం లేదని విమర్శించారు. విద్యారంగంలో క్షేత్రస్థాయిలో అనేక సమస్యలున్నాయని, మెరుగైన వసతులు కల్పించడం లేదన్నారు.
ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన సైకిల్ జాతాలు, పాదయాత్రలు, జీపు జాతాల ద్వారా అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయన్నారు. పూర్తిస్థాయిలో సర్వేలు చేసి ప్రభుత్వ విద్యాసంస్థలు సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తాగునీరు, రక్షణ గోడలు, కరెంటు, మంచినీరు, సైకిల్ స్టాండ్‌లు, రవాణా సౌకర్యం, హాస్టళ్లు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కంప్యూటర్లు, స్కావెంజర్లను నియమించలేదన్నారు. మన ఊరు-మనబడి ద్వారా పాఠశాలలను బాగుచేయించి కాంట్రాక్టర్లు నిధులు దండుకుంటున్నారని విమర్శించారు. చార్జీలు పెంచాలని చెబుతున్న బీఆర్ ఎస్ ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేయడం లేదన్నారు. నూతన విద్యావిధానానికి రాష్ట్ర ప్రభుత్వం పరోక్షంగా సహకరిస్తున్నదన్నారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో సంక్షేమం కరువయ్యిందని, అద్దె భవనాల్లో వసతులు అంతంత మాత్రంగానే ఉన్నాయన్నారు. గురుకులాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని తెలిపారు.
Viral Video: ఈ కొంగ ఏంటి పిల్లను అలా పడేసింది? కారణం అదే అయ్యింటుందా?