ఈ నెల 24 నుండి మార్చి 8వ తేదీ వరకు శ్రీకాళహస్తి దేవస్థానంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో నేడు శ్రీకాళహస్తి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలపై అధికారులతో జిల్లా కలెక్టర్ హరినారాయణ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. శ్రీకాకుళం నుంచి ఎస్‌ఎఫ్‌ఐ నిర్వహించ తలపెట్టిన రాష్ట్ర బస్సు యాత్ర ప్రారంభం కానుంది. శ్రీకాకుళం టు హిందూపురం వరకు విద్యారంగ పరిరక్షణ బస్సు యాత్ర చేపట్టనున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఎస్‌ఎఫ్‌ఐ…