HCU: ఢిల్లీ తర్వాత, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎన్నికల్లో ABVP జయకేతనం..
- ఢిల్లీ యూనివర్సిటీ తర్వాత హెచ్‌సీయూలో ఏబీవీపీ పాగా..
- హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్ ఎన్నికల్లో గెలుపు..
- యువత బీజేపీ వైపు ఉన్నారంటూ ఆ పార్టీ నేతల కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HCU: ఢిల్లీ యూనివర్సిటీ తర్వాత, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల్లో బీజేపీ విద్యార్థి సంఘం అయిన ‘‘అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ABVP)’’ జయకేతనం ఎగరేసింది. ఏబీవీపీ-ఎస్ఎల్వీడీ కూటమి అన్ని సెంట్రల్ ప్యానెల్ పోస్టుల్ని కైవసం చేసుకుంది. కూటమికి చెందిన శివ పాలెపు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఏబీవీపీ కూటమికి చెందిన శ్రుతి ప్రియ ప్రధాన కార్యదర్శి, సౌరభ్ శుక్లా సంయుక్త కార్యదర్శి పదవుల్ని గెలుచుకున్నారు. వీనస్, జ్వాలా సాంస్కృతిక, క్రీడా కార్యదర్శులుగా గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మొత్తం 81 శాతం కన్నా ఎక్కువ ఓటింగ్ నమోదైంది. ఎస్ఎఫ్ఐ, ఎన్‌ఎస్‌యూఐలపై ఏబీవీపీ సత్తా చాటింది.
Read Also: Smriti Mandhana: చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. వన్డే క్రికెట్ చరిత్రలోనే..!
Also Read
- Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
- Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
ప్రతిష్టాత్మక ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఏబీవీపీ గెలిచిన తర్వాత, హెచ్‌సీయూలో కూడా ఏబీవీపీ కూటమి గెలుపొందడంపై బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా, రాహుల్ గాంధీని జెన్-జీ యువత తిరస్కరించిందని ఆ పార్టీ నేతలు ట్వీట్స్ చేస్తున్నారు. ఇటీవల, ఓట్ చోరీ ఆరోపణలపై రాహుల్ గాంధీ ‘‘జెన్-జీ’’ పోరాడాలని పిలుపునిచ్చారు. అయితే, యువత మోడీ , బీజేపీ వెంట ఉందని వారు కామెంట్స్ చేస్తున్నారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఏబీవీపీ క్లీన్ స్వీప్ చేసిందని బీజేపీ నేత అమిత్ మాల్వీయా ట్వీట్ చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విద్యార్థి సంఘం ఎన్ఎస్‌యూఐ తుడిచిపెట్టుకుపోయిందని, రాహుల్ గాంధీ ‘‘జెన్ Z విప్లవం’’ గురించి కలలు తొలగిపోయాయని అన్నారు. పాట్నా యూనివర్సిటీ, పంజాబ్ యూనివర్సిటీ, జేఎన్‌యూ, ఢిల్లీ యూనివర్సిటీ, గౌహతి యూనివర్సిటీ, మణిపూర్ యూనివర్సిటీ, ఉత్తరాఖండ్‌లోనే అనేక యూనివర్సిటీల్లో ఏబీవీపీ సత్తా చాటిందని, ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని కైవసం చేసుకుందని ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ సిక్స్ ప్యాక్స్ చూపించి, స్టేజ్‌లపై తిరగడం యువతను ఆకట్టుకోదని అన్నారు.
ABVP clean sweeps Hyderabad Central University Students Union Elections!
Someone please send a box of tissues to Rahul Gandhi, who keeps hallucinating about a “Gen Z revolution” even as NSUI is getting wiped out across Central Universities.
In just the last year, ABVP has… pic.twitter.com/9KeKEV6sxU
— Amit Malviya (@amitmalviya) September 20, 2025
ABVP’s Total Takeover in University of Hyderabad.
President ✅ Vice President ✅ General Secretary ✅ Joint Secretary ✅
Sports Secretary ✅ Cultural Secretary ✅ ICC GSCASH (Integrated & Research) ✅
Gen Z isn’t confused, we’re clear.
The saffron wave isn’t coming. It’s… pic.twitter.com/xtthh25ke6— ABVP (@ABVPVoice) September 20, 2025
తాజావార్తలు
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!