Marriages are made in Heaven.. పెళ్లిళ్ళు స్వర్గంలో నిశ్చయం అవుతాయంటారు. అదెంత నిజమో కానీ.. కేరళలో మాత్రం ఓ జంట సమ్ థింగ్ స్పెషల్ అనిపిస్తోంది. వీరి వివాహం ఇప్పుడు వైరల్ అవుతోంది. అందరికి ఆదర్శంగా నిలుస్తోంది. తిరువనంతపురం AKG హాల్ లో వివాహం జరిగింది. అక్కడ పెళ్లాడింది ఓ మేయర్, ఎమ్మెల్యే. తిరువనంతపురం కార్పొరేషన్ మేయర్ ఆర్యా రాజేంద్రన్ ను వివాహం బాలస్సేరి ఎమ్మెల్యే సచిన్ దేవ్ తో జరిగింది. దేశంలోనే అత్యంత పిన్న వయసు కల్గిన మేయర్ ఆర్యా_రాజేంద్రన్…( Ex SFI State Leader, Kerala) కాగా దేశంలోనే అత్యంత పిన్న వయసు కల్గిన MLA సచిన్_దేవ్.. ఈయన కూడా స్టూడెంట్ ఫెడరేషన్ నేపథ్యం కలిగిన వారే. ఆయన కేరళ, SFI All India Vice presidentగా వున్నారు.
వీరిద్దరూ ఒక్కటయ్యారు. ఆర్య రాజేంద్రన్ వయసు 23 ఏళ్ళే. ఆమె 12 జనవరి 1999లో రాజేంద్రన్, శ్రీలతలకు జన్మించారు. తండ్రి ఎలక్ట్రీషియన్ కాగా తల్లి ఎల్ ఐసీ ఏజెంట్. 2020 నుంచి తిరువనంతపురం మేయర్ గా వున్నారు ఆర్య రాజేంద్రన్.. ఆమె సీపీఎం మార్క్సిస్ట్ పార్టీ తరఫున ముదవన్ ముగన్ వార్డు నుంచి గెలిచి మేయర్ అయిపోయారు. దేశంలో అతి పిన్న వయసు మేయర్ ఆర్య రాజేంద్రన్ కావడం విశేషం. విద్యార్థి దశ నుంచి ఆమె రాజకీయాలకు ఆకర్షితులయ్యారు. కేరళలో బాలసంఘం అనే విద్యార్థి సంస్థకు అధ్యక్షురాలిగా వ్యవహరించారు.
యూడీఎఫ్ అభ్యర్థి శ్రీకళను 2872 ఓట్ల తేడాతో ఓడించి వార్డు మెంబర్ అయ్యారు. గతంలో అతి చిన్న వయసు మేయర్ గా వున్న కొల్లం మేయర్ సబితా బేగం రికార్డును బ్రేక్ చేశారు. గతంలో మహారాష్ట్ర లోని నాగ్ పూర్ కార్పోరేషన్ కి మేయర్ గా వ్యవహరించారు ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా వున్న దేవేంద్ర ఫడ్నవీస్. ఆయన మేయర్ అయ్యేనాటికి వయసు కేవలం 27 ఏళ్ళు. ఎమ్మెల్యే సచిన్ దేవ్ ది కూడా విభిన్నమయిన నేపథ్యమే. సచిన్ దేవ్ తండ్రి మాతృభూమిలో పనిచేశారు. తల్లి రిటైర్డ్ ఉపాధ్యాయురాలు. సచిన్ దేవ్ 18 అక్టోబర్ 1993లో జన్మించారు. ఈయన వయసు ఇప్పుడు కేవలం 28 ఏళ్ళు. దేశవ్యాప్తంగా వీరి వివాహం చర్చనీయాంశంగా మారింది. సచిన్ దేవ్ లా గ్రాడ్యుయేషన్ చేశారు. విద్యార్ధి ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఎస్ఎఫ్‌ఐ స్టేట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. పెళ్ళితో రాజేంద్రన్, కెఎం సచిన్ దేవ్ వార్తల్లో వ్యక్తులుగా మారారు.
Read Also: Bigg Boss 6: ఈసారి హౌస్ లో రెండు జంటలు!