బావగారు బాగున్నారా, హిట్లర్, ఇద్దరు మిత్రులు లాంటి చిత్రాలలో చిరు సరసన ఆడిపాడిన రంభ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఆమె అందం అలాంటింది. ఇప్పటికి ఆమె గురించి ఎక్కడో ఒక చోట.. ఎవరో ఒకరు మాట్లాడుకుంటారు అంటే అతిశయోక్తి కాదు. ఇక ఆమె అందం గురించి ఇటీవల ‘మహాసముద్రం’ సినిమాలో ఏకంగా ఒక పాటే వచ్చింది. అది రంభకు ఉన్న క్రేజ్.. స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ కెరీర్ పీక్స్ లో…
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మీనా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సీతారామయ్య గారి మనవరాలు చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇక ఆ తర్వాత ఒక వ్యాపారవేత్తను పెళ్లిచేసుకున్న మీనా ప్రస్తుతం రీ ఎంట్రీ తో అదరగొడుతున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ్ భాషల్లో వరుస అవకాశాలను అందుకుంటున్న మీనా తల్లి కాబోతుంది.. ఏంటి.. మీకేమైనా పిచ్చి పట్టిందా..? మీనా వయస్సు ఏంటి..? మీరు మాట్లాడేది…
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో సీనియర్ హీరోయిన్ల రీ ఎంట్రీ పర్వం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలామంది సీనియర్ హీరోయిన్లు కుర్ర హీరోల సినిమాల్లో అక్కగా, వదినగా, తల్లిగా నటిస్తూ బిజీగా మారిపోతున్నారు. ఇక తాజాగా వీరి లిస్ట్ లో చేరిపోయింది లైలా.. తెలుగులో ఎగిరే పావురమా చిత్రంతో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ్ లోను అమ్మడు మంచి గుర్తింపుని తెచ్చుకుంది. ముఖ్యంగా విక్రమ్, సూర్య నటించిన…
విశాల నేత్రాలు, చక్కటి వర్చస్సు, చూడగానే చూపరులను ఆకట్టుకొనే రూపం, అందుకు తగ్గ అభినయం, ఆ రూపానికి తగిన లావణ్యం, దానిని ప్రదర్శిస్తూ సాగే నాట్యం అభినేత్రి శోభనను అందరి మదిలో చోటు సంపాదించుకొనేలా చేశాయి. మళయాళ సీమలో పుట్టినా, తెలుగు చిత్రసీమలో రాణించిన వారెందరో ఉన్నారు. వారిలో నటి, నర్తకి శోభన స్థానం ప్రత్యేకమైనది. తెలుగు చిత్రాలతోనే శోభన మంచి వెలుగు చూశారని చెప్పవచ్చు. నాట్యకళకే అంకితమై దేశవిదేశాల్లో ప్రదర్శనలిస్తూ నేడు ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించిన…
ప్రస్తుతం ప్రతి సినిమాలోనూ సీనియర్ స్టార్ హీరోయిన్ల ఎంట్రీ ఉంటుంది. ఇది ఒక ట్రెండ్ గా నడుస్తుంది అని చెప్పాలి. ఇటీవల రాధేశ్యామ్ చిత్రంలో సీనియర్ స్టార్ హీరోయిన్ భాగ్యశ్రీ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెల్సిందే. ఇక రాధికా, ఖుష్బూ, నదియా, ఆమని లాంటి వారు స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. ఇక వీరితో పాటు స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకున్న సీనియర్ నటి ఇంద్రజ.. ప్రస్తుతం వరుస సినిమాలతో…
ప్రేమ ఖైదీ చిత్రంలో మాలా శ్రీ నటనను ఏ తెలుగు ప్రేక్షకుడు మర్చిపోడు.. అందం, అభినయం కలగలిపిన ముద్దుగుమ్మ తెలుగులో సాహసవీరుడు సాగరకన్య, భలే మామయ్య సినిమాలలో నటించి మెప్పించింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే డైరెక్టర్ ని వివాహం చేసుకొని కన్నడ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడే స్థిరపడిపోయింది. లవ్, యాక్షన్ సినిమాలు చేస్తూ స్టార్‌గా ఎదిగింది. ఇక ఎన్నో ఏళ్ళ తరువాత తెలుగు బుల్లితెరపై ఆమె సందడి చేయనుంది. ఈ సందర్భంగా ఇటీవల ఆమె…
ప్రస్తుతం సీనియర్ హీరోయిన్లందరూ రీ ఎంట్రీల మీద పడ్డారు. ఒకప్పుడు తమ అందం, అభినయాలతో అలరించిన ముద్దుగుమ్మలు ఇప్పుడు స్టార్ హీరోలకు అమ్మలుగా, అత్తలుగా కనిపించి మెప్పిస్తున్నారు. ఇప్పటికే చాలామంది సీనియర్ హీరోయిన్లు రీ ఎంట్రీ ఇచ్చి బిజీగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా వీరి లిస్టులోకి చేరిపోయింది సీనియర్ నటి అర్చన. నిరీక్షణ చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న అర్చన భారత్ బంద్, లేడీస్ టైలర్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అందులో ఆమె నటించిన తీరు…
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా అనగానే టక్కున తూటాలాంటి డైలాగ్స్ గుర్తొస్తాయి.. హీరో ఇంట్రడక్షన్.. ఇద్దరు హీరోయిన్లు.. మెస్మరైజ్ చేసే సాంగ్స్.. బంధాలు, అనుబంధాలు గుర్తొస్తాయి. మరు ముఖ్యంగా త్రివిక్రమ్ సినిమా అనగానే సీనియర్ హీరోయిన్ల ఎంట్రీ ఉంటుంది. ఆయన సినిమాలో చిన్న పాత్రలకైనా సరే బాగా పాపులారిటీ ఉన్న నటులను ఎంపిక చేసుకుంటాడు. ఇక్కడ దొరక్కపోతే పరభాష నటులను దింపుతాడు.. అందులో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఇప్పటికే ఆయన తెరకెక్కించిన ‘అత్తారింటికి దారేది’లో నదియా ..…