బావగారు బాగున్నారా, హిట్లర్, ఇద్దరు మిత్రులు లాంటి చిత్రాలలో చిరు సరసన ఆడిపాడిన రంభ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఆమె అందం అలాంటింది. ఇప్పటికి ఆమె గురించి ఎక్కడో ఒక చోట.. ఎవరో ఒకరు మాట్లాడుకుంటారు అంటే అతిశయోక్తి కాదు. ఇక ఆమె అందం గురించి ఇటీవల ‘మహాసముద్రం’ సినిమాలో ఏకంగా ఒక పాటే వచ్చింది. అది రంభకు ఉన్న క్రేజ్.. స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఒక వ్యాపారవేత్తను పెళ్ళాడి సినిమాలకు స్వస్తి చెప్పింది. ఆ తరువాత కొన్నేళ్ళకు నాచోరే నాచోరే అంటూ ఎన్టీఆర్ తో, అట్టాంటోడే ఇట్టాంటోడే అంటూ అల్లు అర్జున్ తో ఐటెం సాంగ్స్ చేసి ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ భామ అప్పుడప్పుడు టీవీ షోలలో కనిపించడమే తప్ప పెద్దగా మీడియా ముందుకు రాలేదు. అయితే తాజాగా రంభ లేటెస్ట్ పిక్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నాయి.. 20 ఏళ్ళు దాటినా అమ్మడితో మాత్రం ఎటువంటి మార్పు లేదు అంటే అతిశయోక్తి లేదు.
తాజాగా రంభ తన పుట్టినరోజును కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా జరుపుకుంది.. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆమె తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. వైట్ కలర్ టాప్.. కింద బ్లూ కలర్ జీన్స్ లో రంభ ఎంతో అందంగా ఉంది.. కాస్తా బొద్దుగా ఉన్నా కూడా మాది లో ఆ కళ మాత్రం పోలేదు.. సహజంగా వయసు పెరుగుతున్నా కొద్దీ మొహంలో మార్పులు రావడం జరుగుతుంది. కాని రంభ విషయంలో మాత్రం అలా జరగలేదు అని ఈ ఫోటోలు చూస్తుంటే అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ముందు ముందు రంభ ఏమైనా రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయేమో చూడాలి.