టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మీనా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సీతారామయ్య గారి మనవరాలు చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇక ఆ తర్వాత ఒక వ్యాపారవేత్తను పెళ్లిచేసుకున్న మీనా ప్రస్తుతం రీ ఎంట్రీ తో అదరగొడుతున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ్ భాషల్లో వరుస అవకాశాలను అందుకుంటున్న మీనా తల్లి కాబోతుంది.. ఏంటి.. మీకేమైనా పిచ్చి పట్టిందా..? మీనా వయస్సు ఏంటి..? మీరు మాట్లాడేది ఏంటి అని ఆగ్రహం చూపించకండి. మీనా తల్లి కాబోతుంది నిజమే.. కానీ నిజజీవితంలో కాదు సినిమాలో మాత్రమే.. ఇటీవల మీనా ఒక వీడియోను తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసింది. ఈ వీడియో లో మీనా 9 నెలల గర్భవతిగా కనిపించింది.
” చాలా మారిపోయాయి .. అప్పటి రోజుల్లో ఈ గెటప్ వేసుకోవాలంటే చాలా కష్టపడేవాళ్ళం.. ఇప్పుడు చాల ఈజీ అయిపోయింది. అప్పట్లో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎప్పుడూ బరువైన చీరలు కట్టుకునేవారు. కానీ ఇప్పుడు, వారు గెట్ అప్ యొక్క లుక్ మరియు అనుభూతికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సహజంగా కనిపించొచ్చు.. షిఫాన్ చీరలు కూడా ధరించవచ్చు” అని చెప్పుకొచ్చింది. ఈ వీడియో పాతదే అయినా మరోసారి నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే మీనాకు నైనిక అనే పాప ఉన్న విషయం తెల్సిందే. ఈ చిన్నారి కూడా తల్లిలానే చైల్డ్ ఆర్టిస్ట్ గా కొనసాగుతోంది.