కన్నతండ్రి కంటికి రెప్పలా కాపాడాలి. కానీ అతనే యముడయ్యాడు. భర్త అంటే భరించేవాడు. కానీ ఆ భర్త ఆ ఇల్లాలి పాలిట కర్కోటకుడు అయ్యాడు. భార్య, ఇద్దరు పిల్లల్ని దారుణంగా హతమార్చాడు. అతను కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. చెన్నై లో జరిగిన ఈ దారుణం అందరినీ కలిచివేసింది. అప్పుల భారం తట్టుకోలేక భార్య,ఇద్దరు పిల్లలను రంపంతో కోసి చంపేశాడు సాఫ్ట్ వేర్ ఉద్యోగి ప్రకాష్. ఎలక్ట్రిక్ రంపాన్ని అమెజాన్‌లో కొనుగోలు చేశాడు ప్రకాష్. ముగ్గురిని చంపి తను…
భర్త వేధింపులు తాళలేక ఓ వివాహిత అనుమానాస్పదంగా మరణించింది. విజయవాడ నగరంలో 37 ఏళ్ళ వివాహిత మెడా పూర్ణిమ అనుమానాస్పద స్థితిలో మరణించింది. భర్త వేధింపులుకు గురి చేసి హత్య చేశారని ఆరోపిస్తున్నారు మృతురాలి తల్లి, తమ్ముడు. అదనపు కట్నం,పుట్టింటి ఆస్తులు తన పేరుతో రాయాలని చాలా కాలంగా వేధించాడని పూర్ణిమ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వివాదాలు జరుగుతున్న సమయంలోనే అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకొని స్థితిలో పూర్ణిమా మృతిచెందింది. పూర్ణిమది ముమ్మాటికీ హత్య అని ఆరోపిస్తున్నారు…
వదినమ్మ అంటే అమ్మ తరువాత అమ్మ. అలాంటి వదినమ్మకు నరకం చూపాడు ఓ మరిది. అతనికి సహకరించారు కుటుంబసభ్యులు. ఆ వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది ఆమహిళ. బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న వదిన కేసు తనపై వస్తుందని భావించిన మరిది శవాన్ని బావిలో నుంచి తీసి మూటకట్టి …సింగూర్ డ్యామ్ వేసి చేతులు దులుపుకున్నాడు. వికారాబాద్ జిల్లా మోమిన్ పేట మండలం అమ్రాదికలాన్ గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన సంగమ్మని 28 సంవత్సరాల క్రితం ఆశయ్యతో…
ఈరోజుల్లో ప్రతి చిన్న అవసరానికి అప్పు చేయాలి. గతంలో బ్యాంకుల ద్వారా అప్పులు తీసుకోవడం, ఆ తర్వాత వాటిని చెల్లించడం చేసేవారు. అయితే, బ్యాంకుల్లో అప్పులకు వడ్డీలు తక్కువ. ఆలస్యం అయితే జరిమానాలు చెల్లించాలి. అంతేగానీ వేధింపులు వుండవు. కానీ ఇప్పుడు లోన్ యాప్ ల పేరుతో అప్పులిచ్చే సంస్థలు పుట్టుకువచ్చాయి. లోన్ యాప్ ల ద్వారా అప్పులు తీసుకునేవారు అప్రమత్తంగా వుండాలని పోలీసులు సూచిస్తున్నారు. లోన్ యాప్స్ ముఠాలు మళ్ళీ రెచ్చిపోతున్నారు. అధిక లాభాలు వస్తుండటంతో…