Chennai Tragedy: చెన్నైలో విషాదం.. కన్న తండ్రే కాలయముడై!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నతండ్రి కంటికి రెప్పలా కాపాడాలి. కానీ అతనే యముడయ్యాడు. భర్త అంటే భరించేవాడు. కానీ ఆ భర్త ఆ ఇల్లాలి పాలిట కర్కోటకుడు అయ్యాడు. భార్య, ఇద్దరు పిల్లల్ని దారుణంగా హతమార్చాడు. అతను కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. చెన్నై లో జరిగిన ఈ దారుణం అందరినీ కలిచివేసింది. అప్పుల భారం తట్టుకోలేక భార్య,ఇద్దరు పిల్లలను రంపంతో కోసి చంపేశాడు సాఫ్ట్ వేర్ ఉద్యోగి ప్రకాష్.
ఎలక్ట్రిక్ రంపాన్ని అమెజాన్‌లో కొనుగోలు చేశాడు ప్రకాష్. ముగ్గురిని చంపి తను ఆత్మహత్య చేసుకున్నాడు భర్త ప్రకాష్. చెన్నై పల్లావరంలో జరిగిన ఘటన సభ్య సమాజాన్ని నివ్వెరపోయేలా చేసింది. పైగా ముగ్గురిని హతమార్చడానికి తమ పెళ్ళిరోజును ముహూర్తంగా పెట్టుకున్నాడు ప్రకాష్. కుటుంబం మొత్తాన్ని చంపేసి, తను ఆత్మహత్య చేసుకున్న ప్రకాష్ ఉదంతం కలకలం రేపింది. మాకు మేముగా ఆత్మహత్య చేసుకుంటున్నామని సూసైడ్ లెటర్ ను గోడకు అంటించి మరీ ప్రకాష్ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. అప్పులు ఎంతటి విషాదానికి కారణమయ్యాయో చూశారా.
Also Read
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
వివాహిత అనుమానాస్పద మృతి
తెలంగాణలోొ ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మరణించింది. నిర్మల్ జిల్లా కేంద్రం లోని అస్రా కాలనీలో నివాసముండే భోద్ కు చెందిన గొల్లమాడ స్రవంతి అనే 28 సంవత్సరాల వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. రెండేళ్ళ క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. భర్తే చంపాడని ఆరోపిస్తున్నారు మృతురాలి బంధువులు. పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
తాజావార్తలు
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
ట్రెండింగ్
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..