వదినమ్మ అంటే అమ్మ తరువాత అమ్మ. అలాంటి వదినమ్మకు నరకం చూపాడు ఓ మరిది. అతనికి సహకరించారు కుటుంబసభ్యులు. ఆ వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది ఆమహిళ. బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న వదిన కేసు తనపై వస్తుందని భావించిన మరిది శవాన్ని బావిలో నుంచి తీసి మూటకట్టి …సింగూర్ డ్యామ్ వేసి చేతులు దులుపుకున్నాడు.
వికారాబాద్ జిల్లా మోమిన్ పేట మండలం అమ్రాదికలాన్ గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన సంగమ్మని 28 సంవత్సరాల క్రితం ఆశయ్యతో వివాహం చేశారు. 10 సంవత్సరాల క్రితం భర్త ఆశయ మృతి చెందాడు. తన ఇద్దరు కూతుళ్ల తో జీవనం సాగిస్తుందామె. ప్రస్తుత పరిస్థితుల్లో ఆకాశనంటుతున్న భూ ధరలతో మనిషి మృగంగా మారుతున్నాడు. స్వంత అన్న భార్య అయిన సంగమ్మను తరచూ వేదించిన కొన్నిసార్లు ఆమెపై దాడిచేశారు శ్రీనివాస్ అతని భార్య లక్ష్మి. అతనికి సపోర్టుగా మామ భీరయ్య, ఆమెపై దాడి చేయడం వేధించడం మొదలుపెట్టారు.
వేధింపులు భరించలేక మనస్తాపం చెంది గ్రామ శివారులో వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది సంగమ్మ. అది గమనించిన మరిది శ్రీనివాస్ , మిత్రుడు శ్రీహరితో కలిసి మోటార్ సైకిల్ పై తీసుకెళ్లి సింగూర్ డ్యామ్ లో వేసి ఏం తెలియనట్టు ఇంటికి వచ్చేశారు. మా అమ్మ కనిపించడం లేదని పిల్లలు మోమిన్ పేట పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.
వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న మహిళ కేసు తనపై వస్తుందని భావించిన మరిది శవాన్ని బావిలో పడేసినట్టు ఒప్పుకున్నాడు. సింగూర్ డ్యామ్ లో వేసిన శవాన్ని గుర్తించిన పోలీసులు కేసు నమోదుచేశారు. నిందితుడిని రిమాండుకు తరలించామని మోమిన్ పేట సీఐ వెంకటేశం తెలిపారు. తల్లిమరణంతో పిల్లలు కన్నీరుమున్నీరు అవుతున్నారు. వారు అనాథలుగా మారారు.
Rich Persons List: బ్రిటన్ శ్రీమంతుల జాబితాలో భారతీయులు