తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగుల్ని మోసం చేస్తోందని మండిపడ్డారు వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. పేరుకు మాత్రమే ఉద్యోగుల నోటిఫికేషన్స్.. ముందుకు రాని ఉద్యోగాలు అంటూ విమర్శించారు. నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం అంబట్ పల్లి లో ఖాళీగా ఉన్న లక్ష 91 వేల ఉద్యోగాలకు వెంటనే పూర్తిస్థాయిలో నోటిఫికేషన్ లు ఇవ్వాలని, అలాగే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కల్పించాలని నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు తెలంగాణ వైస్సార్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల.
కేసీఆర్ ఇప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లు అని కొత్త మోసం మొదలు పెట్టాడన్నారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చినా 50 వేల నోటిఫికేషన్ అంటాడు కానీ దుబ్బాక, హుజూరాబాద్, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలకు అదే 50 వేల ఉద్యోగాలు అని రీల్ తిప్పారు..మళ్ళీ ఇప్పుడు మునుగోడు ఎన్నికలు వచ్చాయి..మళ్ళీ 50వేల ఉద్యోగాలు అని ఊరిస్తున్నాడన్నారు. త్వరలో 50 వేల ఉద్యోగాలు అని రీల్ తిప్పుతున్నాడు..ఎన్నికలకు ముందు స్విచ్ వేయడం…ఎన్నికల తర్వాత స్విచ్ ఆఫ్ చేయడం మాత్రమే కేసీఅర్ కి తెలుసు.
కేసీఆర్ పనులు గడప దాటవు.. మాటలు మాత్రం కోటలు దాటుతాయి..మాట మాత్రం గడప దాటాదు..వంగడానికి చేతకానోడు వరి చేను మొత్తం నేనే కోశాను అన్నాడట..అలా ఉంది కేసీఅర్ తీరు అని విమర్శించారు..ఉద్యోగాలు ఇవ్వాలంటే ఎన్నికలే కావాలా….ఎప్పుడంటే అప్పుడు నోటిఫికేషన్లు వేయొచ్చు కదా అన్నారు షర్మిల. 10 లక్షల మంది కార్పొరేషన్ల ద్వారా లోన్లు కావాలని దరఖాస్తు పెట్టుకున్నారు ఉద్యోగాలు ఇవ్వరు..కనీసం ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలు కల్పించడం చేత కాదు అసలు పరిపాలన చేతకాదని ఎద్దేవా చేశారు.
ఉద్యోగాల కల్పనలో వైఫల్యం వల్లే 8 ఏళ్ల నుంచి నిరుద్యోగం పెరిగింది..విద్యార్థులు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు..ముందు రెండు లక్షల ఉద్యోగాలు కనిపిస్తుంటే భర్తీ చేయడం చేతకాదన్నారు. అందుకే 40లక్షల మంది నిరుద్యోగులు రాష్ట్రంలో ఉన్నారు..ఇంకా ఎంత మంది నిరుద్యోగులను పొట్టన పెట్టుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు షర్మిల. అచ్చంపేట నియోజక వర్గంలో రమేష్ అనే నిరుద్యోగి చావుకు కేసీఅర్ కారణం కాదా అని ప్రశ్నించారు షర్మిల.
Read Also: Babri Masjid Demolition Case: బాబ్రీ కేసులో అన్ని ధిక్కార పిటిషన్లను క్లోజ్ చేసిన సుప్రీంకోర్టు