మోసాలు, దారుణాలు పెరిగిపోతున్నాయి. డబ్బుల కోసం కొంతమంది కేటుగాళ్ళు ఏం చేయడానికైనా, ఎవరిని ఎంత మోసం చేయడానికైనా వెనుకాడడం లేదు. విజయవాడలో ఓ మహిళ లక్షలు మోసపోయింది. భర్తకి చెబితే ఏమవుతుందోనని, కుటుంబం గురించి కూడా ఆలోచించకుండా బలవన్మరణానికి పాల్పడింది. ఫిల్మ్ రేటింగ్ పేరుతో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. ఆన్ లైన్ లో ఫిల్మ్ రేటింగ్ ద్వారా లక్షల రుపాయలు లాభలంటూ ప్రకటనలు.. అబద్దపు ప్రకటనలతో మోసపోతున్న బాధితులు.
Read Also: Threat to RSS Chief: ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్‌కు మావోయిస్టుల నుంచి బెదిరింపు.. పోలీసులు అలర్ట్
లక్షల రుపాయలు చెల్లించి మోసపోయిందా మహిళ. వాషింగ్టన్ ఫిల్మ్ స్క్వేర్ కంపెనీకి రెండు దఫాలుగా సుమారు 7 లక్షలు చెల్లించింది విజయవాడకు చెందిన హిమబిందు. భర్త నాగకృష్ణ ప్రసాద్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కావడంతో తొలిసారి డబ్బులు చెల్లించినపుడు అడ్డుకున్నాడు భర్త. ఆయనకు తెలియకుండా మరో 7 లక్షల రుపాయలు చెల్లించింది హిమబిందు..డబ్బులు చెల్లించాక సదరు కంపెనీ నుండి స్పందన రాకపోవడంతో మోసపోయినట్లు నిర్దారణకు వచ్చింది హిమబిందు. డబ్బుల విషయంలో భార్య భర్తల మధ్య గొడవలు జరిగేవి.
తాను మోసపోయానని, భర్తకు, కుటుంబ సభ్యులకు మొహం చూపించలేక ఇంటి నుండి వెళ్లిపోయింది హిమబిందు. భర్త ఫిర్యాదు మేరకు ఎస్‌ఆర్ పేట పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కృష్ణ బ్యారేజ్ వరకు సిసిటివి లో హిమబిందు కదలికలు రికార్డయ్యాయి. అయితే ఆ తర్వాత ఫుటేజ్ లో ఆమె కనిపించలేదు. హిమబిందు కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య కు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
Read Also: Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం.. మరో కీలక వ్యక్తి అరెస్టు