భర్త వేధింపులు తాళలేక ఓ వివాహిత అనుమానాస్పదంగా మరణించింది. విజయవాడ నగరంలో 37 ఏళ్ళ వివాహిత మెడా పూర్ణిమ అనుమానాస్పద స్థితిలో మరణించింది. భర్త వేధింపులుకు గురి చేసి హత్య చేశారని ఆరోపిస్తున్నారు మృతురాలి తల్లి, తమ్ముడు. అదనపు కట్నం,పుట్టింటి ఆస్తులు తన పేరుతో రాయాలని చాలా కాలంగా వేధించాడని పూర్ణిమ కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
వివాదాలు జరుగుతున్న సమయంలోనే అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకొని స్థితిలో పూర్ణిమా మృతిచెందింది. పూర్ణిమది ముమ్మాటికీ హత్య అని ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యులు. ఉదయం బెంజ్ సర్కిల్ సమీపంలో నివాసంలో మృతిచెందింది. ఉదయం ఉరి వేసుకొని చనిపోయిందని ఆసుపత్రికి తీసుకొచ్చాడు భర్త జానకి రామయ్య. ఒంటిపై గాయాలు ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు. ఉదయం నుంచి కేసు నమోదు చేయకుండా పోలీసులు తాత్సారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యులు. ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ లో ఏఈగా విధులు నిర్వహిస్తున్నారు జానకి రామయ్య.
బాబోయ్ ఏనుగులు
చిత్తూరు జిల్లాలో గజరాజులు రైతుల్ని కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.పెద్ద పంజాని మండలంలో ఏనుగుల గుంపు విధ్యంసం కలిగిస్తోంది. నిన్న రాత్రి కోగిలేరులో సుమారు ఆరుమంది రైతులకు చెందిన మామిడి, టమోటా, కాలిఫ్లవర్ లతో పాటూ బోరు మోటారు పైపులు, డ్రిప్ పైపులు ధ్వంసం చేశాయి. సమాచారం అందుకున్న అగ్రికల్చర్ అసిస్టెంట్, సర్పంచ్ రమేష్, ఎంపిటిసి తదితరులు పంటపొలాలను పరిశీలిస్తున్నారు. ఏనుగుల విధ్వంసం వల్ల తాము బాగా నష్టపోయామని, నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు.