Kiren Rijiju: భారతదేశం సెక్యులర్ దేశమని, ఈ దేశంలో మైనారిటీలు అత్యంత సురక్షితంగా ఉంటున్నారని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు అన్నారు. హిందువులు మెజారిటీగా ఉండటం కారణంగానే మైనారిటీలు సంపూర్ణ స్వేచ్ఛ, రక్షణ పొందుతున్నారని చెప్పారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో నుంచి ఒక్క మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి కూడా వలస వెళ్లడాన్ని నేను ఎప్పుడూ చూడలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ, దాని వావపక్ష ఎకోసిస్టమ్ మైనారిటీలను చంపుతున్నారని, కొడుతున్నారని, దేశంలో…
TPCC Mahesh Goud : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆపరేషన్ కగార్‌పై రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడిన వెంటనే తనపై అర్బన్ నక్సలైట్, దేశద్రోహి ముద్ర వేశారని ఆయన పేర్కొన్నారు. గురువారం సీపీఐ మఖ్దూమ్ కార్యాలయ పునఃప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మహేశ్ గౌడ్ మాట్లాడుతూ, మఖ్దూమ్ తెలుగు నేలపై జన్మించిన గొప్ప కమ్యూనిస్టు నేత అని కొనియాడారు.…
క క్రైస్తవుడు తన మతాన్ని గౌరవించవచ్చు.. ముస్లిం కూడా తన మతాన్ని గౌరవించుకుంటాడు.. కానీ, హిందువులు మాత్రం తమ మతాన్ని గౌరవిస్తే మాత్రం అభ్యంతరామని ప్రశ్నించారు. ఇది అసలైన నకిలీ సెక్యులరిజం.. నేను హిందువుగా పుట్టాను, హిందువుగా జీవిస్తున్నాను.. నా మతాన్ని గౌరవించడమే కాదు, ఇతర మతాలనూ గౌరవిస్తున్నాను, ఇది నా హక్కు అని ప్యూటీ సీఎం పవన్ పేర్కొన్నాడు.
వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కోర్టులో 73 పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిలో పది పిటిషన్లను ఈ రోజు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ముగ్గురుసభ్యుల ధర్మాసనం వాటిని విచారించింది. వక్ఫ్ చట్టరూపాన్ని ఆర్టికల్ 26 నిరోధించదని, ఆ రాజ్యాంగ నిబంధన సార్వత్రికమైందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
సీపీఐ నేత నారాయణ హెచ్‌సీయూ భూముల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై సుప్రీంకోర్టు వరకు వెళ్లిన నేపథ్యంలో కోర్టు తీర్పు ఎలా ఉంటుందో చూడాలని అన్నారు. ఇందిరా గాంధీ హయాంలో హెచ్‌సీయూ కోసం భూములు కేటాయించారని, కానీ భూముల ధరలు పెరగడంతో అందరి దృష్టి ఇప్పుడు ఈ భూములపై పడిందని చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేర్ ఆసుపత్రి యాజమాన్యం ఆసుపత్రి కోసం సహకరించాలని కోరిందని, అయితే అప్పట్లోనే ఈ భూములు…
Thammineni Veerabhadram : ‘వీక్షణం’ సంపాదకులు ఎన్ వేణుగోపాల్ మీద సోషల్ మీడియాలో చేస్తున్న దాడిని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఖండిస్తున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. తమకు నచ్చని పుస్తకాన్ని అమ్ముతున్నారనే పేరుతో వేణుగోపాల్ పై కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తిరుమల తిరుపతి దేవస్థానం మీద పరిశోధనలు జరిపిన ఒక చరిత్రకారుడు, అది పూర్వం బౌద్ధక్షేత్రం అనీ, దానికి ఆధారాలున్నాయని 40 సంవత్సరాల క్రితం పుస్తకం విడుదల చేశారని,…
తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి చేసిన ప్రకటన సెక్యులరిజంపై కొత్త చర్చకు నాంది పలికింది. భారతదేశానికి సెక్యులరిజం అవసరం లేదని, ఇది యూరప్ భావన అని ఆయన అన్నారు.
Tamil Nadu Governor: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి మరోసారి వార్తల్లో నిలిచారు. ఇప్పటికే అక్కడి స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వానికి గవర్నర్‌కి మధ్య విభేదాలు ఉన్నాయి. అయితే, తాజాగా ఆయన చేసిన ‘‘లౌకికవాదం(సెక్యులరిజం)’’ వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి కారణమైంది.
లౌకికవాదం పేరుతో భారతదేశ ప్రజలకు "మోసం" జరిగిందని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ఆరోపించారు. సెక్యులరిజం యూరోపియన్ భావన.. అది భారతదేశంలో అవసరం లేదని తమిళనాడు గవర్నర్ పేర్కొన్నారు. ఆదివారం కన్యాకుమారిలో జరిగిన ఓ కార్యక్రమంలో గవర్నర్ ప్రసంగిస్తూ.. ‘‘ఈ దేశ ప్రజలపై ఎన్నో మోసాలు జరిగాయి,
గ్రేటర్ నోయిడాలోని శారదా యూనివర్శిటీలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ 'స్వయం సమృద్ధి భారతదేశం' అనే కార్యక్రమంలో ప్రసంగిస్తూ ప్రపంచానికి లౌకికవాదాన్ని బోధించాల్సిన అవసరం లేదని అన్నారు.