Thammineni Veerabhadram : ‘వీక్షణం’ సంపాదకులు ఎన్ వేణుగోపాల్ మీద సోషల్ మీడియాలో చేస్తున్న దాడిని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఖండిస్తున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. తమకు నచ్చని పుస్తకాన్ని అమ్ముతున్నారనే పేరుతో వేణుగోపాల్ పై కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తిరుమల తిరుపతి దేవస్థానం మీద పరిశోధనలు జరిపిన ఒక చరిత్రకారుడు, అది పూర్వం బౌద్ధక్షేత్రం అనీ, దానికి ఆధారాలున్నాయని 40 సంవత్సరాల క్రితం పుస్తకం విడుదల చేశారని, ఇప్పుడు అది తెలుగులో వెలువడినది. హైద్రాబాద్ బుక్ ఎగ్జిబిషన్లో ఆ పుస్తకం అమ్మకానికి పెట్టడాన్ని వీరు ప్రశ్నిస్తున్నారన్నారు.
ఈ చర్యలు భావ ప్రకటనా స్వేచ్ఛ మీద, పరిశోధనల మీద దాడి అని ఆయన అభివర్ణించారు. ఆ పుస్తకాలలో చెప్పిన విషయాలపై అభ్యంతరాలున్నవారు వాటిని ఖండిస్తూ మరో పుస్తకం రాయవచ్చు. ప్రకటనలు చేయవచ్చు. కానీ ఒక మతానికి చెందినవారిని రెచ్చగొట్టి దాడులకు ప్రోత్సహించటం ప్రమాదకరమన్నారు తమ్మినేని వీరభద్రం.
Kerala political Murders: యూత్ కాంగ్రెస్ కార్యకర్తల హత్య.. 10 మందికి జీవిత ఖైదు..
అంతేకాకుండా.. ‘ఇలాంటి చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలనీ, వీటిని ఖండిరచాలనీ ప్రజలకు, ప్రజాస్వామ్యవాదులకు విజ్ఞప్తి చేస్తున్నాము. సోషల్ మీడియాలో ఇలాంటి క్యాంపెయిన్ చేస్తున్నవారి మీద తక్షణం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే గౌరీ లంకేష్, ప్రొఫెసర్ ఎంఎం కల్బుర్గి, నరేంద్ర దబోల్కర్, గోవింద పన్సారే లాంటి మేధావులను ఇలాంటి శక్తులు హత్య చేశారు. రాష్ట్రంలో సీనియర్ జర్నలిస్టు తులసిచందుపై కూడా ఇదే పద్ధతిలో దాడులకు ఉసి గొలుపుతూ ట్రోలింగ్ చేస్తున్నారు. శాస్త్రీయ విమర్శలకు తట్టుకోలేనివారు, మతాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే శక్తులు మాత్రమే ఇలాంటి చర్యలకు పాల్పడతారు. ఇలాంటి స్వార్ధపరుల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ప్రజాస్వామ్య పరిరక్షణకు పూనుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నది.’ అని తమ్మినేని వీరభద్రం వ్యాఖ్యానించారు.