Vijayawada Floods: విజయవాడలోని కృష్ణా నదికి భారీగా వరద నీరు వస్తుంది. దీంతో విజయవాడలోని రైల్వే బ్యారేజ్ కి మూడు అడుగుల దూరంలో ప్రమాదకర స్థాయిలో వరద నీరు ప్రవహిస్తుంది. వరద ప్రవాహం పెరిగితే రైల్వే ట్రాక్ పైకి నీళ్లు వచ్చే అవకాశం ఉంది.
Vijayawada: వరద ముంపు నుంచి ఇంకా విజయవాడ నగరం తేరుకోలేదు. నగర శివారు ప్రాంతాలను కూడా బుడమేరు వాగు ప్రవాహం వదలి పెట్టలేదు. నున్న , గన్నవరం, సింగ్ నగర్ వెళ్ళే మార్గాలకు కనెక్టివిటీ కట్ అయింది. శివారు ప్రాంతాల్లో ఉన్న వందల ఎకరాలు ఖాలీ స్థలాలు, అపార్ట్ మెంట్లు ఇంకా నీటిలోనే మునిగిపోయాయి.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో వివిధ ప్రదేశాలలో చిక్కుకుపోయిన 200 మందికి పైగా ప్రాణాలను రక్షించింది అక్కడి ప్రభుత్వం.
గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం సృష్టించడంతో వరద నీరు ఇళ్ల మధ్యకు చేరి తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. ఇక, గోదావరి వరద ఉధృతి ధవళేశ్వరం దగ్గర ఎల్లుండి నుంచి తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల సంస్థ ఎండీ డా.బీఆర్ అంబేద్కర్ తెలిపారు.
Himachal Pradesh: ఆగకుండా కురుస్తున్న వర్షాలకు ఉత్తర భారతదేశం వణికిపోతుంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు నీటితో నిండిపోయాయి. వరదలకు హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలం అయింది.
ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో విషాదం చోటుచేసుకుంది. యూపీ సంభాల్‌లోని చందౌసి ప్రాంతంలో బంగాళదుంప కోల్డ్ స్టోరేజీ పైకప్పు కూలిపోవడంతో మొత్తం ఎనిమిది మంది మరణించగా.. 11 మందిని రక్షించారు.