NTR : సినిమా నటీనటలు జనాల్లోకి వెళ్లాలంటే వెళ్లలేని పరిస్థితులు ఉంటాయి. ఇటీవల కాలంలో సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయినోళ్లు కూడా రోడ్డు మీద ఓపెన్ గా తిరుగలేని పరిస్థితి.
స్కాట్లాండ్‌లోని చారిత్రక లైట్‌హౌస్‌లో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఈ సమయంలో ఇంజినీర్లు ఓ సీసాలో 132 ఏళ్ల నాటి లేఖను గుర్తించారు. లెటర్‌లో రాసింది చదివిన ఇంజనీర్లు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వారి భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు అందులో రాశారు. న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం.. 36 ఏళ్ల ఇంజనీర్ రాస్ రస్సెల్ ఈ అద్భుతమైన ఆవిష్కరణ గురించి బీబీసీకి చెప్పారు.
నేటి నుంచి ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2024 ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ vs స్కాట్లాండ్ తలపడ్డాయి. షార్జా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు విజయం సాధించింది. బంగ్లాదేశ్ జట్టు దశాబ్దం తర్వాత మహిళల టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో గెలుచింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 16 పరుగుల తేడాతో స్కాట్‌లాండ్‌ను ఓడించింది. దీంతో.. పదేళ్ల తర్వాత టీమ్ విజయం సాధించడంతో జట్టులోని ఆటగాళ్లంతా భావోద్వేగానికి గురయ్యారు.
No Third Umpire: అంతర్జాతీయ క్రికెట్‌లో ఏదైనా మ్యాచ్ జరిగితే ఇద్దరూ ఫీల్డ్ అంపైర్‌లతో పాటు ఓ థర్డ్ అంపైర్ కూడా విధులు నిర్వహిస్తారు. ఈ విషయం ప్రతి ఒక్క క్రికెట్ ఫ్యాన్ కి తెలుసు.. కానీ ఓ ఇంటర్నేషనల్ సిరీస్ కు థర్డ్ అంపైర్ లేకుండానే కొనసాగుతుంది.
శుక్రవారం స్కాట్‌లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ జోష్ ఇంగ్లిస్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో.. శతకం సాధించాడు. ఆస్ట్రేలియా తరఫున అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా జోష్ రికార్డు సృష్టించాడు. ఈరోజు స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్ లో 43 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు.
2024 ICC Women’s T20 World Cup: స్కాట్లాండ్ మహిళల క్రికెట్ జట్టు తొలిసారిగా టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. మే 5 ఆదివారం జరిగిన క్వాలిఫైయింగ్ సెమీ-ఫైనల్స్ లో స్కాట్లాండ్ ఐర్లాండ్‌ను ఓడించి ప్రపంచ కప్ కు అర్హత సాధించింది. స్కాట్లాండ్ 2015 నుండి ప్రపంచ కప్‌కు అర్హత సాధించాలని ప్రయత్నిస్తుంది. చివరకు ఐదవ ప్రయత్నంలో (2015, 2018, 2019, 2022, 2024) తమ లక్ష్యాన్ని సాధించింది. మరో సెమీ-ఫైనల్ లో శ్రీలంక కూడా UAEని…
జీతం ఎక్కువస్తుందనకుంటే ఎన్నో కంపెనీలు మారుతాం. ఎందుకంటే పైసల కోసమే కదా బ్రతికేది. కొందరు ఎక్కువగా డబ్బులు వస్తాయని విదేశాలకు కూడా వెళ్లి సంపాదిస్తారు. ఐతే ఇక్కడ ఏడాదికి జీతం కోటికి పైగా ఇస్తారంట. ఇంతకీ ఎక్కడనుకుంటున్నారా.. ఇండియాలో అయితే కాదు, స్కాట్లాండ్ లో.. స్కాట్లాండ్ పరిధిలోని కొన్ని చిన్న దీవుల్లో వైద్యుల కొరత, టీచర్ల కొరత ఉంది. అందుకోసమని అక్కడి ప్రభుత్వం.. ఓ ప్రకటన చేసింది. ఇక్కడ పనిచేసేందుకు ఉత్సాహవంతులైన వారు కావాలని.. డాక్టర్లకు ఏడాదికి…
Zimbabwe out of race for World Cup Qualifiers 2023: వన్డే ప్రపంచకప్ 2023 క్వాలిఫయర్స్‌లో తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో జింబాబ్వే తడబడింది. మంగళవారం స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో ఓడి.. వరుసగా రెండోసారి ఈ మెగా టోర్నీకి దూరమైంది. ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా స్కాట్లాండ్‌తో జరిగిన ‘సూపర్ సిక్స్’ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో విఫలమయిన జింబాబ్వే మూల్యం చెల్లించుకుంది. క్వాలిఫయర్స్‌లో వెస్టిండీస్ తర్వాత జింబాబ్వే కూడా ఇంటిదారిపట్టింది. ఇక ప్రపంచకప్…
23 నాణేలను పిగ్గీ బ్యాంకులో ఉంచి ప్రపంచ రికార్డు సృష్టించింది ఓ కుక్క. స్కాట్లాండ్‌కు చెందిన ఈ నాలుగేళ్ల కాకర్ స్పానియల్ లియో.. ఒక నిమిషంలో 23 నాణేలను పిగ్గీ బ్యాంకులో వేసి గిన్నీస్ రికార్డ్ సంపాదించింది.
విదేశాల్లో ఉన్నత చదువులంటే విద్యార్థులు ఎంతో ఆసక్తి చూపుతారు. పైగా పేరున్న యూనివర్సిటీలు, విద్యాసంస్థలు అయితే ఇంకా గర్వంగా ఫీలవుతారు. కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లల్లో విదేశాలకు వెళ్లి చదువుకోవాలంటే భయపడిన విద్యార్థులు, తల్లిదండ్రులు ఇపుడు ఆ భయం నుంచి బయటికొచ్చేశారు.