Zimbabwe CWC 2023: స్కాట్లాండ్ చేతిలో ఓటమి.. ప్రపంచకప్ 2023కి జింబాబ్వే దూరం! రెండో బెర్తు ఎవరిదంటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Zimbabwe out of race for World Cup Qualifiers 2023: వన్డే ప్రపంచకప్ 2023 క్వాలిఫయర్స్‌లో తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో జింబాబ్వే తడబడింది. మంగళవారం స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో ఓడి.. వరుసగా రెండోసారి ఈ మెగా టోర్నీకి దూరమైంది. ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా స్కాట్లాండ్‌తో జరిగిన ‘సూపర్ సిక్స్’ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో విఫలమయిన జింబాబ్వే మూల్యం చెల్లించుకుంది. క్వాలిఫయర్స్‌లో వెస్టిండీస్ తర్వాత జింబాబ్వే కూడా ఇంటిదారిపట్టింది. ఇక ప్రపంచకప్ 2023 రెండో బెర్తు కోసం రెండు జట్లు రేసులో నిలిచాయి.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 234 పరుగులు చేసింది. మైకేల్ లీస్క్ (48; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), మాథ్యూ క్రాస్ (38; 2 ఫోర్లు), బ్రెండన్ మెక్‌ములెన్ (34; 6 ఫోర్లు) రాణించారు. జింబాబ్వే బౌలర్లలో సీన్ విలియమ్స్ మూడు వికెట్లు పడగొట్టగా.. చటారా రెండు వికెట్లు తీశాడు. అనంతరం 235 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 41.1 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌట్ అయింది. ర్యాన్ బర్ల్ (83; 8 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ చేయగా.. సికందర్ రజా (34; 2 ఫోర్లు, 1 సిక్స్), మధెవెరె (40; 3 ఫోర్లు, 1 సిక్స్) పోరాడారు. 2019 ప్రపంచకప్‌లోనూ జింబాబ్వే క్వాలిఫయింగ్ టోర్నీలోనే నిష్క్రమించింది.
Also Read
- Advertising Rules: తెలంగాణలో ప్రకటనలపై(యాడ్స్) సర్కార్ కొత్త రూల్స్.. ఉత్తర్వులు జారీ..
- Usha Vance: శిశువుతో హెలికాప్టర్ దిగుతుండగా కింద పడబోయిన ఉషా వాన్స్.. పట్టించుకోని సిబ్బంది
- Rahul Gandhi: ‘‘ఎవరూ తప్పించుకోలేరు’’.. మోదీ, షా, భగవత్, జ్ఞానేష్ కుమార్‌పై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు
- Harish Rao: రాష్ట్రంలో ఒకవైపు కరెంట్ కోతలు.. మరోవైపు కరెంటు బిల్లులతో వాతలు..
Also Read: Tollywood Upcoming Multistarrer: టాలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్.. ముగ్గురు హీరోలు కలిసి సినిమా!
ప్రపంచకప్ 2023కి క్వాలిఫయర్ నుంచి రెండు జట్లు ఎంపికవుతాయన్న విషయం తెలిసిందే. సూపర్-6 దశలో నెదర్లాండ్స్, జింబాబ్వేలను ఓడించిన శ్రీలంక.. ఇప్పటికే ఓ బెర్తును సొంతం చేసుకుంది. స్కాట్లాండ్‌ను ఓడిస్తే.. జింబాబ్వేకు మెరుగైన అవకాశాలు ఉండేవి. కానీ ఆ అవకాశాన్ని జింబాబ్వే చేజేతులారా పోగొట్టుకుంది. ప్రస్తుతం జింబాబ్వే ఖాతాలో 6 పాయింట్లు ఉన్నాయి. స్కాట్లాండ్ ఖాతాలో 6 పాయింట్స్ ఉండగా.. నెదర్లాండ్స్ ఖాతాలో 4 పాయింట్స్ ఉన్నాయి. నెట్‌రన్‌రేట్‌లో జింబాబ్వే (-0.099) కంటే స్కాట్లాండ్ (+0.296), నెదర్లాండ్స్ (-0.042) మెరుగ్గా ఉన్నాయి.
సూపర్-6 దశలో గురువారం (జులై 6) స్కాట్లాండ్, నెదర్లాండ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో స్కాట్లాండ్ గెలిస్తే.. బెర్తు సొంతమవుతుంది. మరోవైపు నెదర్లాండ్స్ గెలిస్తే.. నెట్ రన్‌రేట్‌లో స్కాట్లాండ్‌ను అధిగమించాల్సి ఉంటుంది. అంటే భారీ తేడాతో స్కాట్లాండ్‌ను నెదర్లాండ్స్ ఓడించాలి. అప్పుడే నెదర్లాండ్స్‌కు బెర్త్ సొంతం అవుతుంది. అయితే ఇది అంత సులువేం కాదు. ఇక మ్యాచ్ వర్షం వల్ల రద్దయినా స్కాట్లాండ్‌కే బెర్త్ దక్కుతుంది.
Also Read: Niharika-Chaitanya Divorce: నిహారిక-చైతన్య విడాకులు.. ముందుగా పిటిషన్ వేసింది ఎవరో తెలుసా?
తాజావార్తలు
-
Advertising Rules: తెలంగాణలో ప్రకటనలపై(యాడ్స్) సర్కార్ కొత్త రూల్స్.. ఉత్తర్వులు జారీ..
-
Usha Vance: శిశువుతో హెలికాప్టర్ దిగుతుండగా కింద పడబోయిన ఉషా వాన్స్.. పట్టించుకోని సిబ్బంది
-
Indraja: నటి ఇంద్రజను చూసి ఏడ్చేసిన టాలీవుడ్ నిర్మాత
-
Rahul Gandhi: ‘‘ఎవరూ తప్పించుకోలేరు’’.. మోదీ, షా, భగవత్, జ్ఞానేష్ కుమార్‌పై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు
-
Harish Rao: రాష్ట్రంలో ఒకవైపు కరెంట్ కోతలు.. మరోవైపు కరెంటు బిల్లులతో వాతలు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!