ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉంటే మళ్లీ చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు వల్ల మరలా రాష్ట్రం ఆర్థికంగా పుంజుకుందని ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు. రాష్ట్రంలో ఎన్ని సమస్యలున్నా.. కూటమి ప్రభుత్వం ఎంత మంచి పాలనందిస్తుందో ప్రజలందరూ చూస్తున్నారన్నారు. నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాయంటే.. ప్రధాని నరేంద్ర మోడీ సహకారం కూడా మన రాష్ట్రానికి ఉందన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటాడని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అతడిని…
హిందూ సామ్రాజ్య స్థాపనకు కృషి చేసిన శంభాజీ మహారాజ్ సినిమాను విజయవాడలో మంత్రి సత్యకుమార్ యాదవ్ వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏడున్నరేళ్ళ తరువాత సినిమా చూశానని.. ఒక వీరుడి సినిమా చూశాననే ఆనందం ఉందన్నారు మంత్రి సత్యకుమార్ యాదవ్.
పుష్ప-2 సినిమాపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నంద్యాలలో జ్యోతి ప్రజ్వలన చేసి, సావనిర్‌ను విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆయన అనంతరం మాట్లాడారు. "వీరప్పన్, పూలన్ దేవిల బయోపిక్ చిత్రాలు తీస్తున్నారు.. వీరి బయోపిక్ వల్ల ఏమి నేర్చుకోవాలి..
ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ బాధితులను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుపతి తొక్కిసలాట ఘటన బాధాకరమన్నారు. మృతుల సంఖ్యపై క్లారిటీ ఇచ్చారు. "చిన్న చిన్న దెబ్బలు తగిలిన అందరూ కోలుకుంటున్నారు.. ఒక వ్యక్తి కి ఫాక్చర్ గాయాలు ఉన్నాయి.. తొక్కిసలాట లో ఐదుగురు చనిపోయారు.. క్యూ లైన్ లో అస్వస్థత కు గురై ఒకరు చనిపోయారు..
HMPVపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.. ఈ టెలీ కాన్ఫెరెన్స్‌లో ఉన్నతాధికారులు పాల్గొన్నారు.. HMPVకు సంబంధించి ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ముందుకెళ్లాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు.. వైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉంది.. ప్రస్తుతం ఏ రాష్ట్రాల్లో కేసులు నమోదు చేశారనే వివరాలను సీఎం చంద్రబాబుకు వివరించారు అధికారులు..
డిసెంబరు 12న కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన 'వన్ నేషన్-వన్ ఎలక్షన్' బిల్లు నిరంతర అభివృద్ధి కోసం ఆకాంక్షించే భారతదేశం తరపున ఒక ప్రధాన ప్రకటన అని రాష్ట్ర మంత్రి సత్య కుమార్ యాదవ్ ట్వీట్ చేశారు. అంతకుమించి, మన దేశం 2047 నాటికి 'వికసిత్ భారత్'ను సాకారం చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, మనం స్వాతంత్య్రం పొందిన 100 సంవత్సరాలను జరుపుకుంటున్నప్పుడు ఈ నిర్ణయం, ఈ చారిత్రాత్మక బిల్లు ప్రధాని మోడీ దార్శనికతకు గుర్తుగా నిలుస్తుందన్నారు.
అధిక వర్షాల నేపథ్యంలో ప్రజల ఆరోగ్య పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీగా కురుస్తున్న వర్షాలు మరికొద్ది రోజులు కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నందున ప్రజల ఆరోగ్యం పట్ల వివిధ స్థాయిలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఏపీలో మద్యం పాలసీ రూపకల్పనకు కేబినెట్ సబ్ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఐదుగురు మంత్రులతో మద్యం విధానంపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది. ఈ సబ్ కమిటీలో సభ్యులుగా మంత్రులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్ యాదవ్, గొట్టిపాటి రవి కుమార్లు ఉండనున్నారు.
ఢిల్లీ పర్యటనలో రెండో రోజు పలువురు కేంద్ర మంత్రులను ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కలిశారు. జౌళి శాఖా మంత్రి గిరిరాజ్ సింగ్, అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ఈ సందర్భంగా కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై వివరించారు.
ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రిగా సత్య కుమార్ యాదవ్ బాధ్యతలు స్వీకరించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య సత్య కుమార్ బాధ్యతల స్వీకరించారు. రాష్ట్రంలో 5.30 కోట్ల మందికి కేన్సర్ స్క్రీనింగ్ ఫైలుపై సంతకం చేశానని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. కేన్సర్ను ముందస్తుగా గుర్తించి వైద్యం అందించేందుకు నివారణ, అవగాహన చర్యలు తీసుకుంటామన్నారు.