హిందూ సామ్రాజ్య స్థాపనకు కృషి చేసిన శంభాజీ మహారాజ్ సినిమాను విజయవాడలో మంత్రి సత్యకుమార్ యాదవ్ వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏడున్నరేళ్ళ తరువాత సినిమా చూశానని.. ఒక వీరుడి సినిమా చూశాననే ఆనందం ఉందన్నారు మంత్రి సత్యకుమార్ యాదవ్. ఒక వీరుడి ముగింపు అలా జరిగినందుకు వేదన ఉంది.. ఛత్రపతి శివాజీ, శంభాజీ మహారాజ్‌లను మొదటి స్వాతంత్ర్య యోధులుగా చెప్పాలని పేర్కొన్నారు. అలాంటి వారి చరిత్ర సినిమాగా తీసినందుకు దర్శక నిర్మాతలను అభినందిస్తున్నానని తెలిపారు. సమకాలీన చరిత్రకారుల పైన సినిమా తీయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ అభిప్రాయపడ్డారు.
Read Also: Sanya Malhotra : ఆ ఒక్క సినిమా లైఫ్’నే మార్చేసింది !
వ్యాపారం కోసం స్మగ్లర్లను హీరోలుగా చూపించే విధానం సరికాదని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. హీరోలు గంజా డ్రగ్స్ తీసుకునే సినిమాలు, వ్యాపారం కోసం హీరోలను స్మగ్లర్లుగా చూపించే సినిమాలు యువతను తప్పు దారిలోకి నడిపిస్తాయని మంత్రి అన్నారు. వీరసావర్కర్ వర్ధంతి సందర్భంగా మరొక వీరుని సినిమా చూశానని.. సూరత్ నుంచి తంజావూరు వరకూ శంభాజీ హిందూ సామ్రాజ్యం నెలకొల్పాడని పేర్కొన్నారు. మన దేశానికి వలస పాలకులను గొప్ప హీరోలుగా చరిత్రకారులు సృష్టించారన్నారు. దేశంలో 60 ఏళ్ళకు పైగా పరిపాలన చేసిన పార్టీ మొఘలులు, తలిదండ్రులను చంపిన వారిని చరిత్తకారులుగా చూపించిందన్నారు. శంభాజీ, శివాజీ లాంటి వారి చరిత్ర అందరూ చదువుకోవాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
Read Also: Health Tips: రోజుకు ఒక స్పూన్ అవిసె గింజలు తింటే ఆ వ్యాధులకు వణుకే..