Chinese Manja : గాలిపటాలు ఎగురవేసేటప్పుడు చైనా మాంజా అస్సలు ఉపయోగించొద్దంటూ పదపదే ప్రభుత్వ అధికారులు సూచిస్తుంటారు. అంతేకాకుండా చైనా మాంజా విక్రయాలపై ప్రభుత్వం నిషేధం కూడా విధించింది.
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు.. ఎలాగైనా.. ఎన్ని కష్టాలు భరించైనా సొంత ఊరికి వెళ్లాలని ప్రయత్నాలు చేస్తుంటారు తెలుగు ప్రజలు.. దీంతో, పండు సీజన్‌లో విమానాలు, రైళ్లు, బస్సులు.. ఇలా ఏవి ఆశ్రయించినా ప్రయాణికుల రద్దీ ఉంటుంది.. దీంతో, సొంత వాహనాల్లో కూడా ఊరికి వెళ్లేవారు ఉన్నారు.. అయితే, సంక్రాంతి పండుగకు మరో 16 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే… ఇప్పటికే సంక్రాంతి రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది…
రెబల్ స్టార్ ప్రభాస్ మైథలాజికల్ వండర్ ‘ఆదిపురుష్’ 3డీ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 12న వరల్డ్ వైడ్ రిలీజ్ చేయబోతున్నట్టు చిత్ర బృందం ఈ ఉదయం తెలిపింది. అనేకానేక తేదీలు మార్చుకుని ఎట్టకేలకు ‘ఆదిపురుష్’ వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్ కు ఫిక్స్ కావడం వెనుక దర్శకుడు ఓంరౌత్ కు సంబంధించిన సెంటిమెంట్ ఉందని బాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఓంరౌత్ ఇంతవరకూ కేవలం రెండే సినిమాలను డైరెక్ట్ చేశాడు. ‘ఆదిపురుష్’ అతనికి దర్శకుడిగా మూడో చిత్రం.…
సంక్రాంతి పండుగ తెలంగాణ ఆర్టీసీకి కలిసొచ్చింది. పండుగ నేపథ్యంలో రెండు రాష్ట్రాల ప్రయాణికులకు మంచి సేవలు అందించడమే కాకుండా… వారం రోజుల వ్యవధిలోనే భారీ ఆదాయాన్ని ఆర్జించింది తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సంస్థ. ఎలాంటి అదనపు ఛార్జీలు ప్రయాణికుల వద్ద నుంచి వసూలు చేయకుండానే తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఈ ఘనత సాధించింది. సంక్రాంతి సందర్భంగా టీఎస్ ఆర్టీసీ అదనంగా 55 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చింది.షెడ్యూల్ బస్సులతో పాటు అదనంగా 4 వేల బస్సులను సంస్థ…
సంక్రాంతి పండగ సందర్భంగా భాగ్యనగరంలోని ప్రజలతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నివసించేవారు స్వగ్రామాలకు వెళ్లారు. అయితే సంక్రాంతి పండగ పూర్తి కావడంతో స్వగ్రామాలకు వెళ్లిన ప్రజలు తిరుగుప్రయాణం అవుతున్నారు. అలాంటి వారి కోసం టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. సొంత గ్రామాలకు వెళ్లిన వారి కోసం 3,500 స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసినట్లు టీఆఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్…
దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. రోజుకు దాదాపు రెండు లక్షల పైనే కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులను ఈనెల 30 వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం తరహాలోనే ఏపీలోనూ విద్యాసంస్థలకు సెలవులు పొడిగించే అంశంపై ప్రభుత్వం అధికారులతో విస్తృతంగా చర్చిస్తోంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్కూళ్లు నడిపే విషయంలో విద్యాశాఖ అధికారులు…
సంక్రాంతి సంబరాల్లో అనేక పోటీలు నిర్వహిస్తున్నారు.. సంక్రాంతి వచ్చిందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సంబరాలు జరుగుతాయి.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో కోడి పందాలు, ఎడ్ల పందాలులు చాలా ఫేమస్.. ముఖ్యంగా కోనసీమ జిల్లాల్లో ఇవి పెద్ద ఎత్తున నిర్వహిస్తారు.. ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు కూడా చూసిచూడనట్టుగా వ్యవహరించిన సందర్భాలే ఎక్కువని చెబుతారు.. అయితే, ఈ సారి కోడి పందేలు, ఎడ్ల పందాలకు భిన్నంగా.. పందుల పోటీలు నిర్వహించారు.. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం శివారు ప్రాంతం ఈ…
సంక్రాంతి పండగ సందర్భంగా గాలిపటాలు ఎగురవేయడం సంప్రదాయం. పిల్లలతో సహా పెద్దలు కూడా పండగ సందర్భంగా సరదా పడి గాలిపటాలు ఎగురవేస్తుంటారు. అయితే సంక్రాంతి పండగ ఓ ఇంట్లో మాత్రం విషాదాన్ని నింపింది. చాలా కాలంగా గాలిపటాలకు వాడే మాంజా చాలా ప్రమాదకరమైందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే గతంలో మాంజా చుట్టుకుని ఆకాశంలోని పక్షులు మృత్యువాతపడిన సందర్భాలున్నాయి. అయితే తాజాగా మాంజా చుట్టుకుని ఓ వ్యక్తి మరణించడం మాత్రం గమనార్హం. Read Also: సీఈసీ కీలక…