సంక్రాంతికి ఏపీఎస్ఆర్టీసీకి భారీ ఆదాయం వచ్చింది.. ఈ సమయంలో ఆర్టీసీ ఆదాయం రూ.23 కోట్లు దాటినట్టు ఆ సంస్థ ప్రకటించింది.. పండు సమయంలో 7200 బస్సులతో మొదలుపెట్టి 9,097 బస్సులు నడిపింది ఏపీఎస్ఆర్టీసీ.. మొత్తం 23.71 కోట్ల సంక్రాంతి పండుగ సమయంలో ఆదాయాన్ని ఆర్జించింది ఏపీఎస్ఆర్టీసీ..
Transport Deportment: సంక్రాంతి పండుగా సందర్భంగా రవాణా శాఖ ప్రైవేట్ ట్రావెల్స్ పై భారీగా దాడులు నిర్వహించింది. జనవరి 6 నుండి 18 వరకు, హైదరాబాద్ నగరవ్యాప్తంగా 317 కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. వివిధ కారణాలతో నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేట్ ట్రావెల్స్, కాంట్రాక్టు బేస్డ్ బస్సులపై రవాణా శాఖ అధికారులు సీరియస్ చర్యలు తీసుకున్నారు. రవాణా శాఖ కాంట్రాక్టు క్యారేజీ బస్సులపై భారీగా జరిపిన చలాన్లు వసూలు చేసింది. మొత్తం లక్షా 11 వేల…
సంక్రాంతి పండగకు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడిపించింది. జనవరి 8 నుంచి 13 వరకు 3400 సర్వీసులు, జనవరి 16 నుంచి 20వ తేదీ వరకు 3800 సర్వీసులు నడిపించింది ఏపీఎస్ఆర్టీసీ.
సంక్రాంతి పండుగ సంబరాలు పల్లెల్లో అంబరాన్ని తాకాయి.. మూడు రోజుల పాటు ఘనంగా జరిగిన భోగి, సంక్రాంతి, కనుమ పండగ ముగియడంతో.. తిరిగి పట్నం బాట పట్టారు జనం.. పండగకు ముందు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లే రహదారులు.. ముఖ్యంగా విజయవాడ హైవే రద్దీగా మారి.. ఎక్కడి కక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ కాగా.. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది.. పల్లెకు బైబై చెబుతూ పట్నం బాట పట్టారు..
పండుగ పూట ఓ కుటుంబంలో విషాదం నెలకొంది.. అనారోగ్యంతో ఓ వృద్ధుడు కన్నుమూస్తే.. మద్యం సేవించి కుమారుడు, అతడి బామ్మర్ది గంట వ్యవధిలోనే ప్రాణాలు విడిచారు.. ఈ ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది..
సంక్రాంతి వేళ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గాలిపటం ఎగరవేత విషాదాన్ని నింపింది. చంద్రగిరి పట్టణం బీడీ కాలనీలో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. సమీర్(12) అనే బాలుడు మరో బాలుడితో కలిసి మేడపై గాలిపటం ఎగరవేస్తున్నారు. ఈ క్రమంలో ఓ బాలుడు కిందపడి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.
సంక్రాంతి రోజున మకరజ్యోతి దర్శనం కోసం అయ్యప్ప భక్తులు అధిక సంఖ్యలో కేరళలోని శబరిమలకు తరలివచ్చారు. పొన్నంబలమేడుపై వేలాది మంది భక్తులు మకరజ్యోతిని దర్శించారు.
సంక్రాంతి వచ్చిందంటే చాలు తెలుగులోగిళ్లలో సంబరాలు అంబరాన్ని తాకుతాయి.. అయితే, సంక్రాంతి పండుగ చేసుకోనటువంటి గ్రామం కూడా ఒకటి ఉందంటే అది ఆశ్చర్యం. ఆ గ్రామం ప్రకాశం జిల్లాలోనే ఉంది.. కొమరోలు మండలం ఓబులాపురం గ్రామంలో అంతా రివర్స్.. ఎక్కడైనా సంక్రాంతి వచ్చిందంటే సొంత ఊరికి వస్తుంటారు.. కానీ, సంక్రాంతి పండుగ వచ్చింది అంటే సొంత ఊరు వదిలి ఇతర గ్రామానికి వెళ్తారు. రాష్ట్రమంతా ఉన్న ప్రజలు ఇతర గ్రామాల నుంచి స్వగ్రామాలకు వచ్చే సంక్రాంతి పండగ…
Viral Video : సంక్రాంతి పండుగకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతిగా జరుపుకునే ఈ పంట పండుగను తమిళనాడులో పొంగల్‌గా 4 రోజుల పాటు జరుపుకుంటారు. పండుగ కోసం భారీ సన్నాహాల మధ్య, ఇక్కడ చెస్ ఛాంపియన్లు పొంగల్ వేడుకల సందర్భంగా డ్యాన్స్ చేసిన అందమైన వీడియో వైరల్ అవుతోంది. అవును, పొంగల్ వేడుకకు హాజరైన విశ్వనాథన్ ఆనంద్, డి. గుకేష్, ఆర్. ప్రజ్ఞానంద్.. ఇతర చెస్ ఛాంపియన్లందరూ పంచె ఉట్టు డ్యాన్స్ చేశారు.…
సంక్రాంతి పండగకు ఊరెళ్తున్నారా.. అయితే మీ పర్సును ఒకసారి చెక్ చేసుకోండి.. మీరెప్పుడూ చెల్లించే టికెట్ ఛార్జీలకు రెండింతలో.. లేక మూడింతలో చెల్లించాల్సిన పరిస్థితి ఎదురవచ్చు. మీరెక్కుతున్నది బస్సే కానీ, విమాన ఛార్జీల స్థాయిలో సమర్పించుకోవాల్సిన పరిస్థితి మీకు ఎదురుకావచ్చు.