సంక్రాంతి రోజున మకరజ్యోతి దర్శనం కోసం అయ్యప్ప భక్తులు అధిక సంఖ్యలో కేరళలోని శబరిమలకు తరలివచ్చారు. పొన్నంబలమేడుపై వేలాది మంది భక్తులు మకరజ్యోతిని దర్శించారు.
సంక్రాంతి వచ్చిందంటే చాలు తెలుగులోగిళ్లలో సంబరాలు అంబరాన్ని తాకుతాయి.. అయితే, సంక్రాంతి పండుగ చేసుకోనటువంటి గ్రామం కూడా ఒకటి ఉందంటే అది ఆశ్చర్యం. ఆ గ్రామం ప్రకాశం జిల్లాలోనే ఉంది.. కొమరోలు మండలం ఓబులాపురం గ్రామంలో అంతా రివర్స్.. ఎక్కడైనా సంక్రాంతి వచ్చిందంటే సొంత ఊరికి వస్తుంటారు.. కానీ, సంక్రాంతి పండుగ వచ్చింది అంటే సొంత ఊరు వదిలి ఇతర గ్రామానికి వెళ్తారు. రాష్ట్రమంతా ఉన్న ప్రజలు ఇతర గ్రామాల నుంచి స్వగ్రామాలకు వచ్చే సంక్రాంతి పండగ…
Viral Video : సంక్రాంతి పండుగకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతిగా జరుపుకునే ఈ పంట పండుగను తమిళనాడులో పొంగల్‌గా 4 రోజుల పాటు జరుపుకుంటారు. పండుగ కోసం భారీ సన్నాహాల మధ్య, ఇక్కడ చెస్ ఛాంపియన్లు పొంగల్ వేడుకల సందర్భంగా డ్యాన్స్ చేసిన అందమైన వీడియో వైరల్ అవుతోంది. అవును, పొంగల్ వేడుకకు హాజరైన విశ్వనాథన్ ఆనంద్, డి. గుకేష్, ఆర్. ప్రజ్ఞానంద్.. ఇతర చెస్ ఛాంపియన్లందరూ పంచె ఉట్టు డ్యాన్స్ చేశారు.…
సంక్రాంతి పండగకు ఊరెళ్తున్నారా.. అయితే మీ పర్సును ఒకసారి చెక్ చేసుకోండి.. మీరెప్పుడూ చెల్లించే టికెట్ ఛార్జీలకు రెండింతలో.. లేక మూడింతలో చెల్లించాల్సిన పరిస్థితి ఎదురవచ్చు. మీరెక్కుతున్నది బస్సే కానీ, విమాన ఛార్జీల స్థాయిలో సమర్పించుకోవాల్సిన పరిస్థితి మీకు ఎదురుకావచ్చు.
పందాల పండుగకు రంగం సిద్దమవుతుంది. నెలల తరబడి చంటిబిడ్డల్లా సాకిన పందెం పుంజులను బరిలో దించేందుకు ముహూర్తం దగ్గర పడటంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దూర ప్రాంతాల నుంచి అతిధులు ఇప్పటికే గ్రామాలకు చేరుకుంటున్నారు.. వీరితో పాటు పందాలపై మోజున్న జూదగాళ్ళంతా గోదావరి బాట పట్టారు. పెద్ద మొత్తంలో పందేలు కాసేందుకు సై అంటే సై అంటున్నారు.. ఇదే సమయంలో కూటమి నేతల మద్య పందాల నిర్వాహణ పోటి పెంచుతోంది.…
సంక్రాంతికి ఊరెళ్లే వారికి ఏపీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి సందర్భంగా.. ఎటువంట అదనపు ఛార్జీలు లేకుండా, సాధారణ ఛార్జీలతోనే సంక్రాంతి ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ తెలిపింది. సంక్రాంతి పండగ దృష్ట్యా.. 7,200 ప్రత్యేక సర్వీసులను నడిపేందుకు ఏపీఎస్ ఆర్టీసీ కార్యాచరణ రూపొందించింది.
Kite Manja : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రామవరంలో చైనా మాంజా ఉపయోగంతో తీవ్ర ప్రమాదం చోటుచేసుకుంది. పతంగి ఎగరేసేందుకు వాడిన నిషేధిత చైనా మాంజా ద్విచక్ర వాహనదారుడి మెడకు చుట్టుకోవడంతో అతని మెడకు తీవ్రంగా గాయమైంది. ఈ ఘటనలో రక్తస్రావం అధికంగా కావడంతో గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా మారింది. స్థానికులు అతనిని కొత్తగూడెంలోని ఆసుపత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం తర్వాత హైదరాబాద్‌కి తరలించారు. నిర్వహణ , నిషేధ ఆదేశాలున్నప్పటికీ, చైనా మాంజా ఇప్పటికీ…
Sankranti Special Buses: సంక్రాంతి పండగ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏపీఎస్ ఆర్టీసీ గోదావరి జిల్లాల నుంచి హైదరాబాద్ కు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తుంది. జనవరి 9 నుంచి 13వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది.